Janagama News: జనగామ నడిబొడ్డున ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద 40పీట్ల రోడ్డు ప్రమాదకరంగా మారి, ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, రోడ్డును బాగు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డుమీదనే నాటేసారు. సీపీఎం(CPM) జిల్లా కమిటి మెంబర్ బూడిద గోపి నేతృత్వంలో బాణాపురం రోడ్డు ఎంత ఆద్వాన్నంగా ఉందో ప్రజలతో కలిసి సీపీఎం(CPM) బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా బూడిద గోపి మాట్లాడుతూ బాణాపురం సమీపంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిందన్నారు. అయితే బాణాపురం, ఇందిరమ్మ ఇండ్లు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళే ప్రజలు, భక్తులు ఈ రోడ్డు నుంచే ప్రయాణిస్తారని తెలిపారు. జనగామ(Janagama)కు అవుటర్ రోడ్డు నిర్మిస్తున్న తరుణంలో అనేక లారీలు అధిక లోడుతో ఈ రోడ్డు మీదనుండే వెళ్లుతుండటంతో రోడ్డు గుంతలమయం అయిందన్నారు.
Also Read: MLC Kavitha: దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
అధికారులు స్పందించేనా
ఈ రోడ్డు అద్వాన్నంగా, మోకాలు లోతు గుంతలతో ప్రమాదకరంగా మారిందన్నారు. ఈరోడ్డుపై ప్రయాణిస్తున్న అనేక మంది వాహానదారులు ప్రమాదాల బారిన పడి గాయాల పాలయ్యారని ఆవేధన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డును బాగు చేయడం లేదని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజయేందర్, గాజుల నాగరాజు, తాటి వసంత, పాముకుంట్ల రేణుక, శ్రీపతి మమత, నరసయ్య, కాసుల నీల, గుగ్గిళ్ళ పద్మ కుమారి, అపర్ణ, కూర లక్ష్మి, శ్రీనివాస్, కొమురయ్య, ఆర్య, ఓధ్య నాయక్ పాల్గొన్నారు.
Also Read: Jangaon District Rains: పొంగిపొర్లుతున్న వాగులు… రాకపోకలకు అంతరాయం