Jangaon District Rains: జనగామ జిల్లా పాలకుర్తి మంం తొర్రూరు మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి నుండి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు కిక్కిరిసి మత్తడి పోస్తుండగా, కొన్నిచోట్ల చెరువు కట్టలు కుంగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. సోమరం గ్రామం నుండి అన్నారం(Annaram) వెళ్లే రహదారిపై ఉన్న ఈదుల వాగు మంగళవారం ఉదయం నుండి ఉధృతంగా ప్రవహిస్తూ రహదారి మొత్తాన్ని ముంచెత్తింది. దీంతో రెండు వైపులా వాహనాలు, ప్రజలు ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ప్రాణాలకు తెగించి వాగు దాటేందుకు ప్రయత్నించగా, కొందరు వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.
Also Read: Pratyusha Suicide case: ప్రత్యూష కేసులో కీలక పరిణామం.. డాక్టర్ సృజన్‌కు బిగ్ షాక్
భయంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు
మండలంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్న వాగులు కూడా ప్రళయరూపం దాల్చడంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులు పంట పొలాల వద్దకు వెళ్లలేకపోగా, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాలేకపోతున్నారు. చెరువు కట్టలు కుంగి నీరు ముంచెత్తే ప్రమాదం ఉందనే భయంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు నిద్రలేక రాత్రంతా చెరువుల వద్ద పడికాపులు కాశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని, చెరువు కట్టల పటిష్టతను పరిశీలించాలని గ్రామ పెద్దలు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని, వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: War 2 booking: ‘వార్ 2’ అడ్వాన్స్ బుకింగ్ సంచలనం.. ఒక్కరోజులో..