CP Sai Chaitanya: ఇటీవల ఓ మహిళ తనను వీడియో, ఆడియో కాల్స్ తో ఇద్దరు వ్యక్తులు ఇబ్బంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చేసిన ఫిర్యాదు కలకలం రేపిన ఘటన తెలిసిందే. మహిళ వేధింపుల కేసులో కేసు నిర్లక్ష్యం అవుతున్న విషయాన్ని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సిరియస్ గా తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ తనను వేధిస్తున్నారని వీడియో, ఆడియో కాల్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆయిల్ గంగాధర్, డెంటల్ డాక్టర్ అమర్ లపై కేసు నమోదు అయింది.
ఆ మహిళకు ధైర్యం
ఇందులో నిర్భయ యాక్ట్ కేసులు నమోదు చేసిన అనంతరం వారిద్దరికీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక మహిళను తరుచూ విచారణ పేరుతో పిలవడం, ఇబ్బంది పెట్టడం పై ఆ మహిళా కొన్ని పత్రికల్లో కొన్ని డబ్బులకు కాంప్రమైజ్ అయిందని తప్పుడు వార్తలు రావడంతో పోలీసులు వెంటనే ఆ మహిళకు కాల్ చేసి స్వయంగా పిలిపించి భరోసా ఇచ్చారు. ఏసిపి రాజా వెంకట్ రెడ్డి ఆ మహిళతో మాట్లాడారు. ఈ కేసులో వెంటనే నిందితులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దని ఏసిపి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ మహిళకు ధైర్యం చెప్పి పంపినట్లు సమాచారం.
Also Read: Women Harassment: యువతిని వేధింపులకు గురి చేసిన డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కేసు నమోదు

