Rani Rudramadevi (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Rani Rudramadevi: దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్న నక్సల్స్ .. వారితో డేంజర్!

Rani Rudramadevi: అర్బన్ నక్సల్స్ దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడడం తగదని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రాణిరుద్రమదేవి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ పై యావత్ ప్రపంచమంతా భారత్ కు మద్దతిస్తోందని అన్నారు. కొంతమంది అర్బన్ నక్సల్స్ దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతు న్నారని తెలిపారు. శాతవాహన వర్శిటీ ప్రొఫెసర్, సూరెపల్లి సుజాత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దుర్మార్గం అని అన్నారు. ముఖ్యమంత్రిసహా రాష్ట్ర ప్రభుత్వం కూడా సైనిక చర్యలకు సంఘీభావం తెలిపిం దని అన్నారు.

దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు

రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరే కంగా సుజాత వ్యవహ రించారని అన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దేశమంతా సైనిక చర్యను శ్లాఘిస్తుంటే అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. సీఎం వెంటనే ఆమెపై సీరియస్‌గా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. మహిళలకు పదేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ అనేక అవకాశాలను కల్పిస్తున్నదని అన్నారు. దేశంలోనే మహిళలకు నలుగురు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది బిజెపి అని అన్నారు. గవర్నర్లను కూడా మహిళలను నియమిస్తు న్నదని తెలిపారు. 8 మంది మహిళలకు కేంద్రం మంత్రులుగా కూడా అవకాశం ఇచ్చిందని తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కూడా ఇచ్చిన ఘనత ఉందన్నారు. దీని వల్ల మహిళలకు అనేక అవకాశాలు రాజకీయంగా వస్తున్నాయని అన్నారు.

Also Read: Karregutta Blast: వరంగల్ లో భారీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి.. క్షణ క్షణం ఉత్కంఠ!

బిజెపి పాలనలో మహిళలకు పురోగతి

బిజెపి పాలనలో మహిళలకు ఎంతో పురోగతి సాధిస్తున్నారని అన్నారు. కానీ ఒక మహిళగా ఇలా అధోగతిగా మాట్లాడడం తగదని ఆమె అన్నారు. కాశ్మీర్లో బిజెపి ప్రభుత్వం స్వేచ్ఛ వాయువులు కల్పించేందుకు అనేక విధాలుగా పనులు చేస్తున్నదని అన్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేయడం ద్వారా అక్కడ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ జీవిస్తున్నారని అన్నారు. కాశ్మీర్ ను టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల అక్కడ ఉగ్రవాద షెల్టర్ ఇచ్చే కార్యకలాపాలు తగ్గాయా అని అన్నారు. టూరిజం డెవలప్ కావడం వల్ల అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు అరేళ్ల కాలంలో రెండు కోట్ల మంది టూరిస్టులు అక్కడికి వచ్చారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గడ్డం ఆంజనేయులు, రేసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, పృథ్వీరాజ్, సరిత, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Bhatti Vikramarka: విద్యా, వైద్యానికి సర్కార్ పెద్దపీట.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు