Bhatti Vikramarka: ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం బాలపేట గ్రామ పంచాయతీలో 34 ఎకరాల్లో 166 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఖమ్మం జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి కూడా నిధులు కేటాయించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
గత ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించిందని కానీ తమ ప్రభుత్వం 1148 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకం ద్వారా.54 కోట్ల 16 లక్షల పైగా ఖమ్మం జిల్లా ప్రజలకు కేటాయించడం జరిగిందని అన్నారు. విద్యను సైతం గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందని తమ హయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కు శ్రీకారం చేపట్టామని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ఒక్కో నియోజకవర్గంలో 3500ఇల్లు మంజూరు చేసామని, రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12వేలు అందిస్తూ తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్నారు. పేదలకు ఫ్రీ విద్యుత్ సరఫరా, సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కోట్లాది రూపాయలు నిధుల కేటాయింపు ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలో ఉపయోగంకు శ్రీకారం చేపట్టామన్నారు. నిరుద్యోగులకు సెల్ఫ్ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం జరుగుతుందన్నారు.
also read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు.. గ్రామీణ పర్యాటకంపై ప్రభుత్వం ఫోకస్..
కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అవాకులు చవాకులు పేలుస్తున్నారని మండిపడ్డారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీ నేతలు అభివృద్ధికి అడ్డుగా మారారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం హయంలో కోట్లాది రూపాయలు అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమంటూ ప్రజా ధనం వృదా చేసి లక్షల కోట్లు దోచుకున్నారని అన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా అధికారులతో రివ్యూ చేసి, ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు పూర్తి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవకాశాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ స్థాయిని పెంచాలని కోరారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం నగరంలో పార్లమెంట్ ఎన్నికల ముందే రఘునాథ పాలెం మండలం బాలపేట గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మించుకునేందుకు నేడు శంకుస్థాపన చేయడం శుభపరిణామం అని, విద్య, వైద్యం కు తమ సర్కార్ అగ్ర పీట వేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో మొండిగోడలతో నిర్మాణం చేపట్టారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సహకారం తో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవటం గొప్ప పరిణామం అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.