Warangal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal District: నిబంధనలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Warangal District: భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బాణసంచా విక్రయాలు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Commissioner Sunpreet Singh) విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ కమిషనరేట్ పరిధిలోని బాణాసంచా విక్రయదారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అగ్నిపాపక, పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ బాణాసంచా విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి వుంటుందని. అనుమతుల కోసం వ్యాపాస్తులు ముందుగా తప్పనిసరిగా అగ్నిమాపక విభాగం అధికారుల నుండి ఎన్.ఓ.సి పోందాల్సి వుంటుందని తెలిపారు.

ప్రభుత్వ అధికారుల అనుమతి

అలాగే వ్యాపారస్తులు స్థల యజమాని నుండి అనుమతి పత్రాన్ని పోందాలని, ప్రభుత్వ స్థలాల్లో అయితే సంబంధిత ప్రభుత్వ అధికారుల అనుమతి కావాలని, పక్కా భవనవాల్లో వ్యాపారం నిర్వహించుకోనేవారు ముందుగా భవన ఇరుపక్కల ఇంటి యజమానుల అనుమతితో పాటు, భవన బ్లూ ప్రింట్ ఎనిమిది వందల రూపాయల ప్రభుత్వ బ్యాంక్ చాలాను దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని. ముఖ్యంగా విక్రయదారులు తప్పని సరిగా విక్రయాలు జరిపే ప్రదేశంలో అగ్ని ప్రమాదాన్ని నివారణకై వినియోగించే ఇసుక, నీరు, ఇతర అగ్ని ప్రమాద నిరోధక సాధనాలు అందుబాటులో వుంచుకోవాలని, వీలైనంత వరకు వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇరుకు ప్రదేశాల్లో కాకుండా, విశాలమైన ప్రదేశాల్లో నిర్వహించుకోవాలని. గత అనుభవనాలను దృష్టిలో వుంచుకోని వ్యాపారస్తులు అప్రమత్తంగా వుండటమే పోలీ సుల ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Also Read: Missing Flight: ఆకాశంలో మాయమైన విమానం.. 35 ఏళ్ల తర్వాత ల్యాండింగ్?

బాణాసంచా కాల్చే సమయంలో

ప్రధానంగా ఏలాంటి అనుమతు లేకుండా బాణాసంచా వ్యాపారం(Fireworks business) చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడుతాయని. అనుమతులు లేకుండా వ్యాపారం నిర్వహించే వారిని కట్టడి చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీస్ ప్రత్యేక తనీఖీ నిర్వహిస్తారని. ఎవరైన అనుమతులు లేకుండా బానాసంచా వ్యాపారం నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండని పోలీస్ కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా ప్రజలు సైతం దీపావళి పండుగను జరుపుకునే సమయంలో అప్ర మత్తంగా వుండాలని. ముఖ్యంగా బాణాసంచా కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, చిన్నారులు బాణసంచా కాల్చే సమయంలో పెద్దలు పిల్లల వద్ద వుండాలని తగు జాత్రలు పాటిస్తూ అనందోత్సల నడుమ దీపావళీ పండుగను జరుపుకుండామని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.ఈ సమావేశంలో డీసీపీలు షేక్ అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారులు సుదర్శన్ రెడ్డి, రేమాండ్ బాబు, శ్రీధర్ రెడ్డి, అదనపు డీసీపీ రవి, ఈ, ఎస్పీ శుభంతో పాటు ఏసీపీ జితేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నర్సింహారావులు, ఇన్స్ స్పెక్టర్లు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Also Read: John Wesley: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం నాటకం.. సీపీఐ నేత జాన్‌వెస్లీ కీలక వ్యాఖ్యలు

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..