PM Modi – Srisailam: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటకు వచ్చిన ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi).. తొలుత శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత ప్రధాని మోదీకి ఆలయ అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో గుడిలోకి ఆహ్వానం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రధాని.. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
నంది విగ్రహం వద్ద..
ప్రతీ శివాలయంలో నందీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శివుడి విగ్రహానికి ఎదురుగా ఆయన్ను ప్రతీష్టిస్తారు. ఈ క్రమంలోనే శ్రీశైలం మల్లన్నకు ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉండగా ప్రధాని మోదీ మూల విరాట్ దర్శనానికి ముందు అక్కడకు వెళ్లారు. నంది విగ్రహం వద్ద కాస్త వంగి.. దాని రెండు చెవుల వద్ద చేతులు పెట్టారు. అక్కడి నుంచి శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రధాని స్థాయికి ఎదిగినా.. సంప్రదాయాలను మాత్రం మోదీ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారని బీజేపీ శ్రేణులు ప్రశంసిస్తున్నారు.
#WATCH | Andhra Pradesh: Prime Minister Narendra Modi performs Pooja and Darshan at Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam, Srisailam in Nandyal district.
(Source: ANI/DD News) pic.twitter.com/Ai6MAaO6E0
— ANI (@ANI) October 16, 2025
శివుడికి ఏకవార రుద్రాభిషేకం
అనంతరం మూలవిరాట్ వద్దకు వెళ్లిన ప్రధాని మోదీ.. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల, అర్చన, మహామంగళ హారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాని మోదీకి వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీశైలం ఆలయానికి సంబంధించిన చిత్రపటాలను, శేష వస్త్రాలను మోదీకి ఆలయ అధికారులు, పూజారులు అందజేశారు.
#WATCH | Andhra Pradesh: Prime Minister Narendra Modi performs Pooja and Darshan at Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam, Srisailam in Nandyal district.
Andhra Pradesh CM N Chandrababu Naidu also present.
(Source: ANI/DD News) pic.twitter.com/0AucuWV5wO
— ANI (@ANI) October 16, 2025
Also Read: Nadendla vs Narayana: కూటమిలో బిగ్ ఫైట్.. మంత్రుల మధ్య మాటల రగడ.. నారాయణపై నాదెండ్ల సీరియస్
రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు
కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్, రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్, రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారి, రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి, గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి 450 ఎకరాల్లో ప్రత్యేక ప్రాంగణాన్ని ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రారంభోత్సవం అనంతరం.. ప్రధాని మోదీ ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
