Warangal Police Commissioner(image credit:X)
నార్త్ తెలంగాణ

Warangal Police Commissioner: సైబర్ నేరగాళ్లకు చుక్కలే.. సీపీ సీరియస్..

వరంగల్, స్వేచ్ఛ: Warangal Police Commissioner: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ హనుమకొండ డివిజన్‌ పరిధిలోని సుబేదారి, హన్మకొండ, కెయూసి పోలీస్‌ స్టేషన్లతో పాటు హన్మకొండ ట్రాఫిక్‌, సుబేదారి మహిళా పోలీస్‌ స్టేషన్లను సందర్శించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా హన్మకొండ డివిజన్‌ పోలీస్‌ స్టేషన్లను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు.
అనంతరం స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది వివరాలను సిపి సంబంధిత స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి. స్టేషన్‌ పరిధిలో ఎన్ని సెక్టార్లు వున్నాయి, సెక్టార్‌వారిగా ఎస్‌.ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత సెక్టార్‌ ఎస్‌.ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also read: Inspector Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!

అనంతరం పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులకు పలుసూచనలు చేస్తూ ప్రతి స్టేషన్‌ అధికారి తప్పనిసరిగా రౌడీ ఇండ్లను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని, ఆర్థిక సైబర్‌ నేరాలకు సంబంధించి కేవలం కేసు నమోదు చేయడమే తమ బాధ్యతనే కాకుండా సైబర్‌ నేరాలకు సంబంధించి నేరానికి పాల్పడిన నేరస్థుల మూలాల కూడా దర్యాప్తు అధికారులు కనిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని. ట్రై సిటి పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి క్రయ విక్రయాలపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని సూచించారు.
నేరాల నియంత్రణకై విజుబుల్‌ పోలీసింగ్‌ అవసరమని, ఇందుకొసం నగరంలో నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులకు సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ వెంట్‌ హన్మకొండ ఏసిపి దేవేందర్‌ రెడ్డి, ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ, ఇన్స్‌స్పెక్టర్లు సతీష్‌, సత్యనారయణ, రవికుమార్‌, సీతారెడ్డి, సువర్ణతో పాటు స్టేషన్‌ ఎస్‌.ఐలు పాల్గోన్నారు.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!