Inspector Jobs: నిరుద్యోగులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) గుడ్ న్యూస్ చెప్పింది. రిక్రూట్‌మెంట్ 2025లో ఇన్‌స్పెక్టర్ , సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం మొత్తం 123 పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తు 07-03-2025న ప్రారంభమవుతుంది. ఇది 60 రోజుల్లోపు ముగుస్తుంది. అభ్యర్థి NCB వెబ్‌సైట్ ఈ లింక్ narcoticsindia.nic.in/ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారికంగా ఇన్‌స్పెక్టర్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ల నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
ముఖ్యమైన సమాచారం :
NCB రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి
గరిష్ట వయోపరిమితి: 56 సంవత్సరాలకు మించకూడదు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి
NCB ఇన్‌స్పెక్టర్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
ఖాళీల పోస్టులు
ఇన్‌స్పెక్టర్ – 94
సబ్-ఇన్‌స్పెక్టర్ – 29
ముఖ్యమైన తేదీలు
NCB రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 07-03-2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 60 రోజుల్లోపు అప్లై చేసుకోవచ్చు.