Warangal: గణపతి నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, (Sudharani)వరంగల్ జిల్లా కలెక్టర్(Warangal District) డా.సత్య శారద లు తెలిపారు. వరంగల్ పరిధి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద టెంకాయ సమర్పించి నిమజ్జనాన్ని మేయర్, కలెక్టర్ లు సంయుక్తం గా ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం పది రోజుల ముందుగానే రూ.1.20 కోట్ల కార్పొరేషన్ ద్వారా కేటాయించి వివిధ శాఖల సమన్వయంతో పనిచేసేలా ప్రతి డిపార్ట్మెంటును సమన్వయం చేసుకుంటూ లైటింగ్ ఏర్పాట్లు, సివిల్ పనులు, క్రేన్ల ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నిమజ్జన ప్రాంతం (పాయింట్)లో కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన నోడల్ అధికారులు ఏర్పాట్లను చేశారు.
గజ ఈత గాళ్లను అందుబాటులో
పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యే విధంగా వారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని నిమజ్జన ప్రాంతంలో మత్స్యశాఖ ద్వారా గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచారు. ఇరిగేషన్ అధికారులు అందుబాటులో ఉంచారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ లో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని, పోలీస్ ఇరిగేషన్ మైన్స్ ఫిషరీష్ కార్పొరేషన్ తో సహా అన్ని విభాగాల అధికారుల సమన్వయం తో అత్యంత భక్తి శ్రద్ధలతో పండగ వాతావరణంలో నిమజ్జనం శనివారం మధ్యాహ్నం వరకు జరుగుతుందని సాంప్రదాయంగా చిన్న వడ్డేపల్లి చెరువులోని నిమజ్జనాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందని, నిమజ్జనం సందర్భంగా టెంకాయ సమర్పించి ప్రారంభించడం జరిగిందని మేయర్ తెలిపారు.
17 చెరువులలో 6500 విగ్రహాలు
వరంగల్ జిల్లా(Warangal District) కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Dr. Satya Sarada) మాట్లాడుతూ వరంగల్ నగరంలోని ప్రధాన 17 చెరువులలో 6500 విగ్రహాలను చెరువులలో నిమజ్జనం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చిన్న వడ్డేపల్లి చెరువులోనే 4000 విగ్రహాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఏడు క్రేన్లు ఏర్పాటు చేసి షిఫ్టులలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని అన్నారు. ఉర్సు గుట్ట చెరువులో వెయ్యి విగ్రహాల వరకు, గురజాల చెరువు నర్సంపేటలో, పర్వతగిరి చెరువుల్లో నిమజ్జనంకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒక క్రేన్ కి మూడు షిఫ్ట్ లలో 30 మంది ఇరిగేషన్ అధికారులను చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది
జిల్లా అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలను స్పెషల్ ఆఫీసర్లను నియమించి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం జరిగే ప్రాంతాల వద్ద ఇరిగేషన్ , పారిశుద్ధ్య, మత్స్యశాఖలకు చెందిన సిబ్బంది మూడు షిఫ్ట్ లలో పని చేస్తారన్నారు. 71 గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్ నియంత్ర జరిగేలా శాఖ సహకారంతో చర్యలు తీసుకుంటున్నాను అన్నారు. ఫిషరీస్, ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ , బల్దియా అధికారుల తో పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని శనివారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
వెయ్యి విగ్రహాలు నిమజ్జనానికి ఇక్కడికే?
కమిషనర్ చాహాత్ బాజ్ పాయి మాట్లాడుతూ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చిన్న వడ్డేపల్లి ప్రాంతంలో ఏడు క్రేన్లను నిమజ్జనానికి అందుబాటులో ఉంచామని వరంగల్ పరిధికి సంబంధించి సుమారు వెయ్యి విగ్రహాలు నిమజ్జనానికి ఇక్కడికే వస్తాయని అధికారులు సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులను కేటాయించడం జరిగిందని రాత్రి వేళలో కూడా నిమజ్జనం జరుగుతుందని కావున అధికారులు కూడా అందుబాటులో ఉంటారని రాత్రి మొత్తం కూడా నిమజ్జనం కొనసాగుతుందని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు సురేష్ జోషి, కావేటి కవిత బస్వరాజు కుమారస్వామి, డి సి పి.షేక్ సలీమా,సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఏ సి పి శుభం,ఇరిగేషన్ బల్దియా ఈ ఈ లు కిరణ్ భీమ్ రావు ఏం హెచ్ ఓ డా.రాజేష్ ట్రాఫిక్ ఏ సి పి సత్యనారాయణ తహసిల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.
Also Read: Uttam Kumar Reddy: మహిళలలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.. మంత్రి కీలక వ్యాఖ్యలు