Warangal Drug Bust( IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Warangal Drug Bust: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత!

Warangal Drug Bust: వరంగల్ డ్రగ్ కంట్రోల్ టీం, ఖానాపూర్ ఎస్ఐ చిలకమ్మ నగర్ చిలుకలగుట్ట ఏరియాలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఈ విషయానికి సంబంధించి వరంగల్(Warangal) సీపీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. చిలుకలగుట్ట ఏరియాలో తెల్లని బస్తా సంచులు గుట్టపై నుంచి కిందకు దించుతున్నారనే సమాచారంతో సంఘటన స్థలం చేరుకుని పోలీసులు పరిశీలించగా నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా నాలుగు గంజాయి సంచులు, ఒక నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బండి ఉండగా, వెంటనే వారిని అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. వారిలో అందాల పాండు రెడ్డి @ పాండు @ నాయుడు, గుళ్లారి మునిరాజ్, కొప్పు కోటయ్య, భూక్య సాయికుమార్ @ సాయి వీరు వ్యవసాయ పనులు చేయడం వలన వచ్చే డబ్బులు జీవనానికి సరిపోకపోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజుల నుండి రమేష్ గిల్లమడుగుకు మరియు మజ్జి కృష్ణ ఇద్దరు గంజాయిని అమ్ముతుంటారు.

 Also Read: Bhupalapally district: భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్త, కూతుర్ని లేపేసిన మహిళ!

ఒక్కొక్కరికి 10,000/- రూపాయలు

విరు చెప్పిన విధంగా గంజాయినివెహికిల్ లోడ్ చేస్తే వారికి ఎక్కువ మొత్తం డబ్బులు ఇస్తానని చెప్పగా, పాండు రెడ్డి, మునిరాజ్, కోటయ్య, నాయేని రమేష్ లు సరే ఒప్పుకోని, గత కొంతకాలంగా వాళ్లు చెప్పిన స్థలంలో చెప్పిన విధంగా గంజాయి వెహికల్ లోడ్ చేసేవారు. దానికి గాను వారికి ఒక్కొక్కరికి 10,000/- రూపాయలు ఇచ్చేవారు. ఇదేక్రమములో గుర్రాలు రమేష్ తాను గుర్రాలు గ్రామం ఇంకా సమీప అడవులలో పండించిన గంజాయిని కొని కూలీల ద్వారా కలిమల ఏరియా నుండి ఆంధ్ర బార్డర్ లోని మెయిన్ రోడ్డుకు చేరవేసి అక్కడినుండి దానిని అమ్మేవాడు, రమేష్ గుర్రాలూరులోనే ఉండేవాడు రమేష్ తరపున మజ్జికృష్ణ గంజాయిని కొనేవాళ్లకు అమ్మి డబ్బులు తీసుకుని వీరికి కూలి డబ్బులు ఇచ్చేది, మిగతా డబ్బులు రమేష్ కు ఇచ్చేవాడు. ఇదే క్రమములో తేదీ: 21.08.2025 రోజున60 గంజాయి ప్యాకెట్లను సాయికుమార్ తీసుకువచ్చిన కారులో నింపినారు.

అడవిలో దాచిపెట్టిన గంజాయి

అదే విధంగా. తేదీ: 27.08.2025 రోజున రమేష్ మరియు కృష్ణ ఫోన్ చేసి ట్రాలీలో గంజాయి లోడ్ చేసేది ఉన్నది రమ్మని చెప్పగా,పాండు, మునిరాజ్, కోటయ్యమరియు నాయిని రమేష్ లము కలిసి తులసిపాక మెయిన్ రోడ్ లో రమేష్ వద్దకు వెళ్లగా, తేది;28.08.2025 రోజున తులసిపాక మెయిన్ రోడ్ ప్రక్కన అడవిలో దాచిపెట్టిన గంజాయిని చూపించి నంబర్ లేని ట్రాలీలో లోడ్ చేయమని రమేష్ చెప్పనాడు,వారు చెప్పిన విధంగా గంజాయిని అట్టి ట్రాలీలో లోడ్ చేసిన తరువాత అప్పుడు రమేష్ వీరితో మీరు నలుగురు కలిసి ఇదే ట్రాలీలో వెళ్లిగంజాయిని సాయికుమార్ కు అప్ప చెప్పి రమ్మని చెప్పగా, ఈ నలుగురం అదే ట్రాలీలో ఎక్కి భద్రాచలం, ఇల్లందు మీదుగా వరంగల్ వైపు ప్రయాణం చేస్తూ వస్తుండగా హైవే మీద పోలీసు వారు ఎక్కువగా ఉంటారని తెలుసుకొని, గంగారం మీదుగా కొత్తగూడ నర్సంపేట వైపు వస్తుండగా, పాకాల చెరువు దాటినా తరువాత కొద్ది దూరం లో, చీకటి పడుతుండగా పోలీసు వారు ఎక్కువగా ఉండి వాహనాల తనిఖీ చేస్తున్నారు.

వీరు పోలీసు వారిని దూరము నుండి గమనించి ట్రాలీని ఆపుకొని ఇట్టి విషయాన్ని కృష్ణ కు ఫోన్ చేసి చెప్పగా, పోలీసు వారు పట్టుకుంటే ట్రాలీ కూడా పోతుందని చెప్పి గంజాయిని ఎవరికి కనిపియకుండా అడవిలో దాచి పెట్టమని చెప్పగా, అట్టి ట్రాలీని వెనుకకు తిప్పుకొని అక్కడ నుండి సుమారు 5 కిలోమీటర్ ల దూరంలో ఒక గ్రామం దాటినా తరువాత ఎడమవైపున ఉన్న ఒక్క బోర్డు ప్రక్కన గల గుట్ట పైకి తీసుకుని వెళ్లిగంజాయిని ఎవరికీ కనపడకుండా గుట్ట పైన దాచిపెట్టి దాని పైన ఒక కవర్ తో కప్పిపెట్టి, అదే ట్రాలీలో వాళ్ళ ఉరికి వెళ్లిపోయినారు.

 Also Read: JubileeHills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కీలక అప్‌డేట్

తరువాత నిన్నటి రోజున రమేష్ ఇతనికి ఫోన్ చేసిగంజాయిని కొనడానికి సాయికుమార్ పార్టీని తీసుకొని వస్తున్నాడు, మీరు వెళ్లి గంజాయిని దాచిన ప్రదేశము ను సాయికుమార్ కు చూపెట్టమని చెప్పగా, ఈ రోజు ఇతను, మునిరాజ్, కోటయ్యలు మజ్జి కృష్ణ యొక్క పల్సర్ బండిమీద గంజాయిని దాచిన ప్రదేశము గుట్ట వద్ద ఉండగా, అక్కడికి సాయికుమార్ వచినాడు, అతను వీరితో మీరు దాచిపెట్టిన గంజాయి ని చూపెట్టితె నేను బండి మాట్లాడుకొని గంజాయి తీసుకోని పోతాను అని చెప్పగా, గంజాయి దాచిన దగ్గరకు అందరు అట్టి ప్రదేశాముకు వెళ్లి చూడగా, అట్టి ప్రదేశం లో దాచిపెట్టిన గంజాయి మూటలు అలగెఉండి వాటి పైన వర్షం పడితే తడవకుండా ఉండే విదంగా, కప్పిన కవర్ అలాగేఉంది.

కేజీ రూ. 50,000/- చొప్పున, మొత్తం రూ. 3,81,92250/-

తరువాత బండి వచ్చేలోపు ఆ గంజాయి ముటల్లనింటిని రోడ్ దగ్గరలో వేసుకొని బండి రాగానే వెంటనే లోడు చేయవచ్చు అనే ఉద్దేశంతో, పాండు మరియు సాయికుమార్ లు రోడు ప్రక్కన ఉండి వచ్చి పోయే వారిని గమనిచుకుంటూ, వీరు ఇచ్చే సిగ్నల్స్ ను బట్టి కోటయ్య మరియు మునిరాజ్ లను అట్టి గంజాయి మూటలను తీసుకురమ్మని చెప్పినారు, దాని ప్రకారమే గుట్ట పై నుండి కోటయ్య మరియు మునిరాజ్ లు పోలీస్ ల మైన మీము అక్కడకి వెళ్ళే సరికి 4 గంజాయి మూటలు తెచ్చినారు.ఇంతలో వారు మమ్ములను చూసి పారిపోతుండగా పట్టుకున్నాము. ఇవె కాకుండా ఇంక గుట్ట పైన ఇంక 19 గంజాయి మూటలు ఉన్నాయి అని చెప్పి మేము వారితో పాటు గుట్ట పైకి వెళ్తే గంజాయి దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపిస్తామని చెప్పగా, పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి స్వాదినపరుచుకున్న మొత్తం 23 సంచులలో గంజాయి బరువు 763.845 కిలోలు ఇట్టి మొత్తం ఎండు గంజాయి విలువ, కేజీ రూ. 50,000/- చొప్పున, మొత్తం రూ. 3,81,92250/- ఉంటుంది.

నేరస్తులను తదుపరి చట్టరీత్యా తగు చర్య నిమిత్తంకేసు నమోదు చేసినారు. గంజాయి ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి,డ్రగ్స్ కంట్రోల్ టీం ఇన్స్ స్పెక్టర్ సతీష్, ఆర్.ఐ శివాకేశవులు,ఏఏ ఓ సల్మాన్ పాషా,ఆర్. ఎస్. ఐ లు పూర్ణ చందర్, మనోజ్,నాగరాజు, ఏ. ఎస్. ఐ సుబ్బిరామిరెడ్డి,కానిస్టేబుళ్ళు నజీర్ అహ్మద్, రజాన్ పాషా,రబ్బానీ, అమరేశ్వర్,రాజ్ కుమార్, జావీద్, రమేష్, సృజన్, బాలాజీ, రాంచందర్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

 Also Read: Villagers Steal Asphalt: వామ్మో ఇదేం దొంగతనంరా స్వామి.. ఏకంగా కొత్త రోడ్డునే లేపేశారు?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం