Telangana Police Duty Meet 2025( image CREDIT: Swetcha reporter)
నార్త్ తెలంగాణ

Telangana Police Duty Meet 2025: పోలీస్ డ్యూటీ మీట్‌కు సర్వం సిద్ధం: సీపీ సన్ ప్రీత్ సింగ్

Telangana Police Duty Meet 2025: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూర్ పీటీసీ వేదికగా  నుంచి మూడు రోజులపాటు జరగనున్న తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ 2025 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. డ్యూటీ మీట్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణ, అతిథుల వసతి, భోజన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read: Powerstar Srinivasan: రూ. 5 కోట్ల మోసం కేసులో పవర్ స్టార్ అరెస్ట్?

బాధితులకు భరోసా కల్పించాలి..
పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్(Warangal Police)కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఈ రాజు, వీ జయకుమార్, బీ రాజమౌళి, పీ సారయ్య, ఎం నరేంద్ర చారి బుధవారం సీపీని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తన చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా, నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలబడాలని పదోన్నతి పొందిన ఎస్సైలకు ఈ సందర్భంగా హితవు పలికారు.

 Also Read: Sigachi Industry: సిగాచి పరిశ్రమ అమరులైన కార్మికులకు నివాళులు

Just In

01

Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!

Gold Rate Today: వరుసగా రెండో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్?

FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్‌లో పెత్తనం అంతా ఆయనదే?.. చక్రం తిప్పుతున్న ఎఫ్​ఎస్‌డీ ఆఫీసర్

OG Review In Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ జెన్యూన్ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?

OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?