Chinna Mupparam: భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు డిమాండ్!
Chinna Mupparam (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Chinna Mupparam: అక్రమంగా ప్రభుత్వ భూమి కబ్జా.. భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు డిమాండ్..!

Chinna Mupparam: గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని దౌర్జన్యంగా పట్టా చేసుకున్నారని మండలంలోని చిన్న ముప్పారం సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా దోచుకొని దౌర్జన్యం చెల్లిస్తున్నారు అని అన్నారు. గ్రామంలో రైతు వేదిక వద్ద ఉన్న సర్వే నెంబర్ 620, 623, 624, లో 7 ఎకరాల18 గుంటలు, సబ్ స్టేషన్ వద్ద సర్వేనెంబర్ 492,507,508,509,510, మొత్తం 6 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా ఆ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని గ్రామ సర్పంచ్ రాయిలీ భవాని శేఖర్(Bhavani Shekar) విజ్ఞప్తి చేశారు.

Also Read: Jana Nayagan Postponed: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న విజయ్ దళపతి.. ‘జన నాయగన్’ రిలీజ్ వాయిదా..

ప్రభుత్వ స్థలంలో దురాక్రమణలు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు వేదిక మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వెనకాల ఉన్న భూమి అలాగే సబ్ స్టేషన్ వెంబటి వున్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై గతంలో కూడా తాసిల్దార్(MRO), ఇతర అధికారులకు కు పలుమార్లు గ్రామస్తులు విన్నవించారని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని పట్టా చేసుకోని ప్రభుత్వ స్థలంలో దురాక్రమణలు సరికాదని ఆక్రమణదారులకు పలు మార్లు సూచించినా.. వారు మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆక్రమణకు గురౌతున్న ప్రభుత్వ స్థలం(Govt Land)లో హెచ్చరిక బోర్డులతో పాటు అక్రమదారులపై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సర్వే నెంబర్ల ప్రకారం భూమిని కొలతలు వేసి హద్దులు నిర్ణయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు కాలేరు శివాజీ, సట్ల అనీల్, కారు పోతుల రాకేష్, నర్రా అశోక్, పిట్టల నరేష్, యాకన్న, ఏర్పుల నరసింహ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: MLA Rajesh Reddy: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సీఎం కప్ లక్ష్యం : ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి!

Just In

01

Khamenei – Trump: ‘ట్రంప్.. నీ పతనం ఖాయం’.. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్

GHMC: ఆ తేది నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలనకు ఛాన్స్.. ఆ తరువాతే మూడు కార్పొరేషన్ల ఉత్తర్వులు?

India-US Trade Deal: మళ్లీ నోరుపారేసుకున్న అమెరికా.. ఈసారి గట్టిగా ఇచ్చిపడేసిన భారత్!

Telangana Rising 2047: దావోస్‌ వేదికగా తెలంగాణ రైజింగ్‌ 2047.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

CM Revanth Reddy: వివాదాలతో సమస్యలు పరిష్కారం కావు .. రాజకీయం కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యం : సీఎం రేవంత్ రెడ్డి