Jana Nayagan Postponed: ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చాకా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతున్నాయి. మొన్న బాలయ్య బాబు అఖండ 2 తాండవం అయితే నేడు సౌత్ ఇండియా లో బిగెస్ట్ స్టార్ అయిన దళపతి విజయ్ సినిమా ‘జన నాయగన్’. తాజాగా జన నాయగన్ విడుదల తాత్కాలికంగా వాయిదా పడిందని నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అధికారిక హాండిల్ ద్వారా నోట్ ను విడుదల చేశారు. రిలీజ్ కు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. దీనిని చూసిన విజయ్ దళపతి ఫ్యాన్ నిరాశ చెందుతున్నారు. అసలే విజయ్ చివరి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టకున్నారు అభిమానులు. చివరి నిమిషంలో సినిమా ఆగిపోవడంతో ఫ్యాన్స్ నిర్మాణ సంస్థపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి నుంచీ ఇదే విషయంపై వార్తలు వస్తున్నా నిర్మాతలు ఎందుకు పట్టించుకోలేదని? నిర్మాతలు పట్టించుకుని ఉంటే సినిమా విడుదల అయ్యేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Read also-Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..
వాయిదా ఎందుంటే?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ తెలుగులో ‘జన నాయకుడు’ విడుదలకు ముందే ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దళపతికి చివరి సినిమా కావడమే ఈ క్రేజ్ కి అంత కారణం. ఈ సినిమా జనవరి 9, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, సెన్సార్ బోర్డు (CBFC) ఇప్పటివరకు సర్టిఫికేట్ మంజూరు చేయలేదు. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. బోర్డు సూచించిన మార్పులన్నీ తాము పూర్తి చేశామని, అయినా సర్టిఫికేట్ ఇవ్వకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని చిత్ర నిర్మాణ సంస్థ (KVN ప్రొడక్షన్స్) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో విజయ్ చివరి సినిమా అనుకున్నట్లుగానే రిలీజ్ వాయిదా పడింది.
Read also-iBomma Ravi: ఐ బొమ్మ రవికి మరో షాక్.. సవాల్‌కి సరైన ట్రీట్‌మెంట్!
కారణం ఇదే..
విజయ్ దళపతి ‘జన నాయకుడు’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, అంతే కాకుండా సాయుధ దళాలను తప్పుగా చిత్రించాయని ఫిర్యాదులు అందాయని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలిపింది. అందుకే ఈ సినిమాను ‘రివైజింగ్ కమిటీ’కి పంపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ వివాదం గురించి జనవరి 6న జరిగిన విచారణలో, సినిమాపై వచ్చిన ఫిర్యాదుల తాలూకు రికార్డులన్నింటినీ సమర్పించాలని జస్టిస్ పి.టి. ఆశా సెన్సార్ బోర్డును ఆదేశించారు. కేవలం రోజుల్లోనే విడుదల పెట్టుకుని, సర్టిఫికేట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో రివైజింగ్ కమిటీకి పంపడంపై చిత్ర బృందం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనివల్ల ఆర్థికంగా భారీ నష్టం జరుగుతుందని కోర్టుకు వివరించారు. కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జనవరి 7 కు వాయిదా వేసింది. అప్పుడు కూడా ఫలితం రాకపోవడంతో సినిమా వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని వారు వారు తెలిపారు. అయితే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
— KVN Productions (@KvnProductions) January 7, 2026

