Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో రూపుదిద్దుకున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఇందులో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ఓ కీలక పాత్రతో నటించిన విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల సిద్ధమైన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్ శిల్పాకళా వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..
Also Read- Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!
పేరుపేరునా అభినందనలు
నయనతార ఈ సినిమాలో చాలా గొప్పగా నటించింది. తను కూడా మాకు కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయింది. ఈ సినిమాలో నయనతార కనిపించిన తీరు అద్భుతంగా ఉంటుంది. తను అద్భుతంగా నటించి మెప్పించింది. నటీనటులు అందరూ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్లందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఒక గోదావరి పడవ ప్రయాణం వలే ఉండే మ్యూజిక్‌ని ఇచ్చాడు. ‘మీసాల పిల్ల’ సాంగ్ వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మంచి హిట్ ఇచ్చింది. పాటలో లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో హుక్ స్టెప్ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. థియేటర్లో ఆ సాంగ్ టోటల్‌గా హైలైట్ అవుతుంది. ఆ సాంగ్ వింటున్న వెంకటేష్ ఎదురుగా డాన్స్ వేశారంటే.. అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆ సాంగ్‌ని ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్‌కు అభినందనలు.
Also Read- Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!
చిరు ఎమోషనల్
నేను ఇంత అందంగా కనిపించడానికి మా కెమెరామెన్ సమీర్ రెడ్డి కారణం, అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తను చాలా ఫాస్ట్ కెమెరామెన్. కాఫీ తాగే గ్యాప్ కూడా ఇవ్వరు కాబట్టే.. సినిమా 88 రోజుల్లోనే పూర్తయింది. ఆయనలాంటి కెమెరామెన్స్ ఉంటే ప్రొడ్యూసర్స్‌కి ఖర్చు తగ్గుతుంది. ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించారు. సాహు అందర్నీ చాలా కంఫర్టబుల్‌గా చూసుకున్నారు. చాలా మంచి నిర్మాత. తనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నా బిడ్డ సుస్మిత… తను ఇండస్ట్రీకి వస్తానని చెప్పినప్పుడు.. కష్టపడి పని చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పా. తను అదే మాట ప్రకారం నిరంతరం కష్టపడుతూ పనిచేసింది. ఈ సినిమా కూడా సాహూతో కలిసి తను నిర్మాణం చేసింది. తనకున్న కంఫర్ట్‌ని వదులుకొని చాలా హార్డ్ వర్క్ చేసింది. సాహు, తను బెస్ట్ కాంబినేషన్‌లో ఈ సినిమా చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలాంటి హిట్ తండ్రిగా నాకు ఇచ్చినందుకు తను గర్వపడుతుంది. ఈ పరిశ్రమలో నాకు అన్ని రకాలుగా భుజం కాస్తూ.. ఇంటికి పెద్ద బిడ్డ అయినందుకు ఆ పెద్దరికాన్ని సొంతం చేసుకుంటూ, నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. రామ్ చరణ్ (Ram Charan)తో పాటు తను నాకు మరో బిడ్డ. రామ్ చరణ్‌కు ఏదయితే చెప్తానో.. తనకు కూడా అదే చెప్పా. ఇదే కష్టాన్ని నమ్ముకోండని. కచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేస్తాడు. ప్రతి ఒక్కరు ఏదో సాధించాలనే లక్ష్యంతోనే ఉండాలి. నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధిలోకి వస్తారని నాకు తెలుసు. ఇదే అభిమానం, ప్రేమ మీరు ఎప్పుడూ నా మీద చూపించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

