Medaram Jatara2026: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మహా మేడారం జాతరలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం కీలక ప్రకటనలు చేశారు. మేడారం మహా జాతరకు కేంద్ర మంత్రులు జుయల్ ఓరం, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్రమంత్రి జు ఓరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతరకు భక్తులు కోట్లాదిమంది రావడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
భక్తులకు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తాం
మేడారంకు వచ్చే భక్తులకు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు ఆమోదించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి మేడారం మహా జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వనదేవతల విగ్రహాల పున ప్రతిష్టాపన నిర్మాణ పనులు, శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టడం గర్హనీయమన్నారు. ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ గిరిజన జాతరకు ఆదివాసీల ఆత్మగౌరవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌరవం ఇస్తుందన్నారు.
Also Read: Medaram Jatara: మేడారం జాతరలో కీలక ఘట్టం.. గద్దెపైకి సారలమ్మ.. నేడు సమ్మక్క ఆగమనం!
గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు
కేంద్ర బీజెపి ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం ప్రత్యేకించి వెల్లడించారు. ధరతి ఆబా ట్రైబల్ విలేజ్ డెవలప్మెంట్ అభియాన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లను కేటాయించిందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి జంజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పి ఎం-జాన్ మన్) కు రూ.24000 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలను కాపాడడం, బిర్సా ముండా వంటి నాయకులను కేంద్ర బీజెపి ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐ టి డి ఏ పీవో చిత్రమిశ్రాలతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు.
Also Read: Medaram Jatara: మేడారం మహా జాతర..పెళ్లి కుమారుడిగా ముస్తాబైన సమ్మక్క భర్త పగిడిద్దరాజు గద్దె!

