Warangal Crime (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal Crime: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Warangal Crime: నేను చదువుతా అనుకున్న చదువుకి మీరు ఒప్పుకుంటలే మీరు చెప్పిన చదువు నాకు అర్ధం కాలేదు. మీకు చెబితే అర్ధం చేసుకోలేదు. ఒత్తిడి తట్టుకోలేక పోతున్న చివరికి నాకు చావే దిక్కు అయింది అంటూ చదువుతో ఒత్తిడి తట్టుకోలేక ఓ ఇంటర్ విదార్థి ఆత్మహత్య(Inter student suicide) చేసుకున్న విషాద ఘటన హనుమకొండ(Hanukakonda)లో చోటు చేసుకుంది. హనుమకొండ నయీంనగర్ లోని ఎస్సార్ కాలేజ్(SR College) కు చెందిన మిట్టపల్లి శివాని(Shivani)(16) అనే విద్యార్థిని ఎంపీసీ(MPC) ఫస్ట్ ఇయర్(1 Year) చదువుతుంది. ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం తెల్లవారు జామున క్లాస్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ ను బట్టి చదువు అర్థం కాక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్న అని పేర్కొంది.

మమ్మీ చెల్లిని అయిన దానికి నచ్చిన చదువు బాగా చదివించండి. నా లాగ అర్ధం కాని చదువు చెల్లిని చదివించవద్దు. నాకు నచ్చిన చదువు మీరు వద్దు అన్నారు. మీకు నచ్చిన చదువు నాకు అర్థం కావడంలేదు. తక్కువ మార్కులు వచ్చాయి. మీరు డబ్బులు కట్టారు కాబట్టి అతికష్టం మీద ఇప్పటి వరకు చదివాను. నాకు చదువు అర్థం కాక బాగా టెన్షన్‌గా ఉంది. ఇక నాకు చావే శరణ్యం అని భావించుకుని ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ నోట్(Suside Note) లో విద్యార్థిని సూసైడ్ నోట్‌లో రాసింది. తల్లిదండ్రులు పిల్లలను చదివించేముందు ఏం చదువుతారో అడిగి అడ్మిట్ చేయండి అంటూ ఆవేదనతో తల్లికి సూసైడ్ నోట్ రాసింది.

Also Read: Kangana Ranaut: విదేశీయుడ్ని చూసి నేర్చుకోండి.. చాలా సిగ్గుచేటు.. నటి కంగనా!

చెల్లికైన మంచి కాలేజీలో చదువు చెప్పించండి
నాకు ఇష్టం లేని చదువు అర్దం కావట్లేదంటూ అర్థం కాని చదువు చదవలేక, పేరెంట్స్ అర్థం చేసుకోక టెన్షన్ లో మైండ్ పోతోందని ఆవేదన వ్యక్తం చేసిన శివాని(Shivani) తన చెల్లికైన మంచి కాలేజీలో తనకు నచ్చిన చదువు బాగా చదివించాలని సూసైడ్ నోట్ లో పేర్కొంది. చెల్లిని మంచిగా చదివించి మీరు మంచిగ ఉండండి కాళేజిలో జాయిన్ చేసేముందు ఎవరినైన కొంచం అడిగి జాయిన్ చేయండి, చెల్ల నువ్వు కూడా మంచిగ చదువుకోవే అంటూ శివాని తన చెల్లికి సూచించింది. సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కూతురును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది.

తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం మంచిది కాదు
తల్లిదండ్రులు(Perents) వారికి నచ్చిన పద్ధతిలో పిల్లలు చదువాలనుకోవడం సరైన పద్ధతి కాదని ఇప్పుడు అంటున్నారు. పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రంగం వైపు వారు కోరుకున్న చదువు వైపు ప్రోత్సహిస్తే మంచిదని, పిల్లల మానసిక పరిస్థితిని కాదని సొంత అభిప్రాయాన్ని పిల్లలపై రుద్దితే ఇలాంటి దుష్పరిణామాలు తలెత్తుతాయని మానసిక వైద్య నిపుణులు(Psychiatrists) పేర్కొంటున్నారు.

Also Read; TS Politics: గ్రేటర్ గులాబీ బాధ్యతలు.. ఆ ఇద్దరిలో ఎవరికి?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు