TSRTC
నార్త్ తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

TGRTC: టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు..

TGRTC: బతుకమ్మ, దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

7754 ప్రత్యేక బస్సులు తిప్పనున్న ఆర్టీసీ
ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు
ప్ర‌జ‌ల‌ను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు
కాల్‌ సెంటర్‌ 040-69440000, 040-23450033

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ (TGRTC) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెష‌ల్ బ‌స్సు సర్వీసులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది. సెప్టెంబర్ 20 (శనివారం) నుంచి అక్టోబ‌ర్ 2 (గురువారం) వరకు ఈ స్పెషల్ బస్‌లను అందుబాటులోకి ఉంచనుంది. సద్దుల బ‌తుకమ్మ 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉంది. దీంతో ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముండ‌టంతో ఆ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది.

తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో  పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు న‌డుపుతోంది.

Read Also- Vemsoor Tahsildar Office: భూ రికార్డులు, రైతు బంధులో అక్రమాలు.. వేంసూర్ తహసిల్దార్ కార్యాలయంలో మరో బాగోతం

కనీస డీజిల్ వ్యయాలు భరింపు

కాగా, దసరా పండుగ ప్రత్యేక బస్‌లలో మాత్రమే ప్రభుత్వం రిటర్న్ జర్నీలో ఖాళీగా వచ్చే బస్సులకు కనీస డీజిల్ వ్యయాల మేరకు టికెట్ ధ‌ర‌ల్లో మార్పులు చేయనుంది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదీవరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయని ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని, అవి యధావిధిగా ఉంటాయని వెల్లడించారు. పండుగ‌ల దృష్ట్యా ప్ర‌జ‌ల‌కు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉందని తెలిపారు.

గ‌త ద‌స‌రా కంటే ఈ సారి అద‌నంగా 617 ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేశామని, తాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారన్నారు. పోలీస్, ర‌వాణా, మున్సిపల్ శాఖల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాల‌కు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. కాల్‌ సెంటర్‌ 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

Read Also- OG Trailer Update: ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Just In

01

Bathukamma Record: గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యంగా బల్దియా ‘బతుకమ్మ’ వ్యూహం

Swetcha Effect: ఆర్థిక భారం అలసత్వం స్వేచ్ఛ కథనంతో.. హెచ్ సిటీ పనులకు రంగంలో దిగిన కమిషనర్

Haris Rauf controversy: భారత ఫైటర్ జట్లు కూల్చినట్టుగా బౌలర్ రౌఫ్ ఇచ్చిన సంకేతంపై పాక్ రక్షణ మంత్రి స్పందన

Fake Passbook: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్

Ram Gopal Varma: అభిమానులకు రామ్ గోపాల్ వర్మ పెద్ద పరీక్షే పెట్టాడుగా.. అదేంటంటే?