Mahesh Kumar Goud 9 IMAGE CREDIT: TWITTER)
నార్త్ తెలంగాణ

Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ జనహిత పాదయాత్ర -2.. 24 నుంచి 26 వరకు నిర్వహణ

Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) జనహిత పాదయాత్ర ఈ నెల 24 నుంచి మొదలై, 26తో తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పబ్లిక్, కార్యకర్తల అభిప్రాయం మేరకు తదుపరి తేదీని ప్రకటించనున్నారు. జనహిత పాదయాత్ర(Janahita Padayatra) కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నుంచి మొదలై, వరంగల్ జిల్లా9Warangal District) వర్ధన్నపేట్ వద్ద ముగియనున్నది. ఈ పాదయాత్రలో శ్రమదానాన్ని భాగస్వామ్యం చేశారు. తొలి విడత పాదయాత్ర సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పాదయాత్రలు చేయాలని పీసీసీ నిర్ణయించుకున్నారు. ఆ పాదయాత్రల్లో సీఎం, మంత్రులనూ భాగస్వామ్యం చేయనున్నారు.

 Also Read: BRS Party: ప్రజా సమస్యలపై స్పందన కరువు.. సమస్యలపై కమిటీ సైలెంట్?

కార్యకర్తల్లో జోష్
మొదటి విడత జనహిత పాదయాత్ర(Janahita Padayatra)పై ప్రజల్లో విశేష స్పందన లభించింది. దీంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాండమ్‌గా పాదయాత్ర చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రెండో విడతలో మొదటి దశ కంటే ఎక్కువ మంది ప్రజలు, పార్టీ నేతలు భాగస్వామ్యం అవుతారని పార్టీ భావిస్తున్నది. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, పదవులపై హామీ, నేతల మధ్య పంచాయతీలను తెంచడం వంటివి ఈ పాదయాత్ర ద్వారా పీసీసీ చీఫ్​ పూర్తి చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మొదలు పెట్టిన ఈ పాదయాత్ర, పార్టీతో పాటు ఆయనకూ ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందని నేతల్లో చర్చ జరుగుతుంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపరేషన్
పీసీసీ చీఫ్ చేస్తున్న పాదయాత్ర స్థానిక ఎన్నికలకు ప్రిపరేషన్ తరహాలో ఉన్నదని పార్టీ నేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నేతలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలపై పబ్లిసిటీ ఇస్తూ స్థానిక నేతలను ప్రజలతో మమేకమయ్యేలా ఆ పాదయాత్రలో స్ట్రాటజీని పాటిస్తున్నారు. దీని వలన క్షేత్రస్థాయిలోని నేతలకు ప్రజల నుంచి ఆధరణ లభిస్తుందని పార్టీ భావిస్తున్నది. నేతల్లో జోఫ్ నింపుతూ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

 Also Read: HBD Chiranjeevi: నాడు దేశంలో ఎక్కువ రెమ్యూనరేషన్ హీరో.. అమితాబ్ కూడా అందుకోలేని పారితోషికం

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు