Bhadrachalam Temple (image credit:ai/twitter)
నార్త్ తెలంగాణ

TGSRTC: భక్తుల ఇంటి వద్దకే భద్రాద్రి సీతారామ కళ్యాణ తలంబ్రాలు.. చేయాల్సింది ఇదే!

నర్సంపేట, స్వేచ్ఛ: TGSRTC: భక్తుల ఇంటి వద్దకు భద్రాద్రి సీతారామ కళ్యాణ తలంబ్రాలను తరలిస్తామని నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి తెలిపారు. సోమవారం టిజిఎస్ ఆర్టీసీ నర్సంపేట డిపో లో ఈ వివరాలను వెల్లడించారు. లాజిస్టిక్స్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలు వస్తాయన్నారు.  ఈ మేరకు భక్తులు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ  తెలిపారు. సీతారాముల తలంబ్రాలు కావాలని కోరుకునేవారు, నేరుగా భద్రాచలం పోలేని వారు బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.

Also Read: Warangal News: ములుగు డిఎస్పీ సీరియస్ వార్నింగ్.. ఇలా చేస్తే కటకటాలే..

భక్తులు తలంబ్రాల బుకింగ్ కొరకు నర్సంపేట బస్టాండు యందు గల కార్గో, లాజిస్టిక్స్ ఆఫీస్ యందు కార్గో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్ నరేందర్, కార్గో ఏజెంట్స్ వద్ద 151/-రూపాయలు చెల్లించి బుకింగ్ రషీదు పొందగలరని తెలిపారు. సీతారాముల కళ్యాణం అనంతరం ఇంటి వద్దకు కార్గో ఏజెంట్స్ ద్వారా తలంబ్రాలు పంపిణి చేస్తారని పేర్కొన్నారు. భద్రాచలంలోని శ్రీ సీతా రాముల కళ్యాణానికి వెళ్లలేని భక్తులు ఇట్టి సదావకాశాన్ని వినియోగించుకుని శ్రీ రాముని ఆశీస్సులు పొందగలరని అన్నారు. తలంబ్రాల బుకింగ్ కొరకు 9154298763, 9704991357 నంబర్లను సంప్రదించవచ్చని వివరించారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు