Advait Kumar Singh: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. అజ్మీర లాక్య వికలాంగ రైతు యూరియా కోసం లైన్లో నిలబడి కుప్పకూలిపోయాడు. ఏరియా కోసం నిలబడిన లైన్లో తొక్కిసలాట కావడంతో లాక్య తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో యూరియా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(State Human Rights Commission) దృష్టికి ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామారావు(Immaneni Rama Rao) తీసుకెళ్లారు. దీంతో పరిశీలన చేసిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Collector Advait Kumar Singh) పై కేసు నమోదు చేసింది.
కలెక్టర్, డిపిఆర్ఓ లకు హెచ్ఆర్సీ నోటీసులు
మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓవైపు వృద్ధా వికలాంగుడు తీవ్రంగా గాయపడిన విషయంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు 239 జీవో వాయిలెన్స్ లో కూడా హెచ్ఆర్సి నోటీసులు జారీ చేసింది. 239 జీవో వైలెన్స్ విషయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. 17. 03. 2024 లో కొంతమంది విలేకరులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఒక సంస్థలో పనిచేస్తూ మరో సంస్థలో అక్రిడిటేషన్ కార్డు(Accreditation card) పొంది, ఫోక్సో, మర్డర్(Murder), వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసిన విషయంలో జరిగిన అవకతవకలపై పోలీస్ శాఖ ద్వారా విచారణ జరిపించి ఎంబసీ సర్వీస్ నష్టపోకుండా నూతన కార్డులు జారీ చేయాలని కలెక్టర్ కు విన్నవించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మహబూబాబాద్ జిల్లాలో మాత్రమే 239 జీవో ప్రకారం అక్రిడిటేషన్ కార్డు జారీకి ముందు అగ్రీటేషన్ వెనుక భాగంలోని నిబంధన 5లో ప్రతి మూడు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉండగా అది ఇక్కడ జరగడం లేదు.
Also Read: CBI Raids Anil Ambani Home: అనిల్ అంబానీ నివాస ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు
కొంతమంది విలేకరులు ఫిర్యాదు
నోటిఫికేషన్ 239 జీవో ప్రకారం 2022- 2023 కాలానికి ఒక మీడియా సంస్థలు పనిచేసి మరో మీడియా సంస్థలు అక్రిడిటేషన్ కార్డులు పొందిన కార్డులపై, కోర్టు కేసులు ఉన్నవారికి, ఉద్యోగులు, మీడియా సంస్థలలో పని చేయని వారికి, మహిళలకు, మటన్, చికెన్, కల్ల అద్దాల షాపు, మెడికల్ షాపు, హాస్పిటల్, ల్యాబ్, తీబి మెకానిక్, ప్రైవేట్ బ్యాంకు మేనేజర్, నల్ల బెల్లం, ఇసుక దందా, రౌడీ షీటర్ లకు, రేషన్ షాపు డీలర్లకు, కోర్టు కేసులు ఉన్నవారికి, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలలో పని చేసే వారికి, కోర్టులో పనిచేసే వారికి, చెప్పుల షాపు నిర్వహించే వారికి అక్రిడిటేషన్ కార్డులు నిబంధనలకు విరుద్ధంగా జారి చేసిన విషయంపై మానవ హక్కుల కమిషన్ కు కొంతమంది విలేకరులు ఫిర్యాదు చేశారు. అయితే హెచ్ ఆర్ సి విచారణ అనంతరం ఇలా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసిన వారందరికీ రద్దుచేసి గత కొన్ని నెలల క్రితం నూతనకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న నేటికి అతిగతి లేదని తెలుపుతూ మహబూబాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి వివిధ మీడియా సంస్థలలో పని చేస్తూ అర్హులైన ఇంకా అక్రిడిటేషన్ కార్డు పొందని వారికి పత్రికా ప్రకటన జారీ చేసి మంజూరు చేయాలని విజ్ఞప్తి చే
అక్రిడిటేషన్ కమిటీ నిర్వహించకుండా
అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్న కలెక్టర్ 239 జీవో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగు నిర్వహించాలి. సమావేశం నిర్వహించకుండా అర్హులైన జర్నలిస్టు(Journalist)లకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో కొంతమంది జర్నలిస్టులు కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా విషయాన్ని పరిశీలించి ఇస్తామని చెప్పి నామమాత్రంగా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి కావాలనే దురుద్దేశంతో అధికారులు కాలయాపన చేశారని జర్నలిస్టులు ఆరోపించారు. మళ్లీ 03.09.2024 మహబూబాబాద్ కోర్టును ఆశ్రయించినప్పటికీ మరోసారి సమాచార శాఖ సంబంధాల కమిషనర్, జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి నోటీసులు జారీ చేసి తిరిగి 05.10.2024న సమాధానం అడగగా అందుకు సంబంధించిన వివరాలను అందించలేదని జర్నలిస్టులు ఆరోపించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేసి బాధ్యులైన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, డి పి ఆర్ ఓ రాజేంద్ర ప్రసాద్ లకు హెచ్ఆర్సీ నోటీసులను జారీ చేసింది.
Also Read: Sand Scam: ఇసుక రీచ్ వద్ద భారీ దోపిడీ.. అధికారుల పర్యవేక్షణ కరువు!