Sand Scam (imagecredit:swetcha)
తెలంగాణ

Sand Scam: ఇసుక రీచ్ ‌ వద్ద భారీ దోపిడీ.. అధికారుల పర్యవేక్షణ కరువు!

Sand Scam: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ రీచ్ ల వద్ద మాత్రం వసూళ్ల పర్వం ఆగడం లేదు. లారీ ఇసుకకు 3500 నుంచి 4వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీనికి తోడు కాంటా, పార్కింగ్, ఇసుక లెవలింగ్ , సీరియల్ అంటూ ఒక్కో దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపించడం, కొందరు అధికారుల సహకారంతో రీచ్ కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫిర్యాదులు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నారు.

నిబంధనల ప్రకారం ఇసుక

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలకు ఇసుక(Sand)ను అందుబాటులోకి తెచ్చేందుకు సుమారు 70 స్టాక్ యార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్ లైన్ లో బుక్(Online boking) చేసుకున్నవారికి సీరియల్ ప్రకారం ఇసుకను సరఫరా చేస్తుంది. అయితే ప్రస్తుతం వర్షాలు వస్తుండటంతో 13 రీచ్ లు మాత్రమే నడుస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రీచ్ లలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్ లైన్ లో టన్నుకు సుమారు రూ.412 నిర్దేశించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. టైర్లను బట్టి లారీ యజమానులు ఇసుకను బుక్ చేసుకుంటారు. 16 టైర్ల లారీకి 35 టన్నుల బుకింగ్ ఉంటుంది. రూ.14,433 చెల్లిస్తున్నారు. ఈ డీడీ తీసుకొని కేటాయించిన రీచ్ వద్దకు వెళ్లి సంబంధి రీచ్ కాంట్రాక్టర్ కు ఇస్తే మళ్లీ రూపాయి చెల్లించకుండా నిబంధనల ప్రకారం ఇసుకతో లారీ లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా వసూళ్ల పర్వానికి తెరదీశారు. ఒక్కో పనికి ఒక్కో రేటు కేటాయించి మరీ వసూళ్లు చేస్తున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు.

ఇసుక రీచ్‌ల వద్ద వసూళ్లు

ఒక్క లారీ లోడ్ చేస్తే 3500 నుంచి రూ.4వేలు వసూళ్లు చేస్తున్నారని లారీ యజమానులు పేర్కొంటున్నారు. వర్షాకాలం కావడంతో ఇసుక లెవలింగ్ చేసినందుకు రూ. వెయ్యి, కాంటా 500, జేసీబీ రూ.200, గ్రామపంచాయతీకి రూ.100, పార్కింగ్ రూ.100, సీరియల్ అంటూ మరో 100, ఇలా సుమారు 7 నుంచి 8వేలు అదనంగా కాంట్రాక్టర్లు ఇసుక రీచ్ ల వద్ద వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక లారీ ఇసుకకు వచ్చే లాభం అంతా కాంట్రాక్టర్లకే ఇవ్వాల్సి వస్తుందని ఆరోపించారు. ములుగు(Mulugu) జిల్లాలో ప్రస్తుతం 8 ఇసుక రీచ్ లు పనిచేస్తున్నాయని యాకన్న గూడెం, సీతారాంపురం, రామన్నగూడెం, రామచంద్రాపురం, బోధాపురం, ఇప్పగూడెం, వాడగూడెం, టేకులగూడెం నుంచి ఇసుకను ప్రభుత్వం కేటాయిస్తుందని వెల్లడించారు. యాకన్నగూడెంలో కాంట్రాక్టర్లు లారీకి 4వేలు డిమాండ్ చేసి మరి తీసుకొంటున్నారని, సీతారాంపురంలో డబ్బులు ఇవ్వకపోతే లారీ డ్రైవర్లపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అంటేనే డ్రైవర్లు జంకుతున్నారని తెలిపారు.

Also Read: Komatireddy venkat reddy: లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్లు నీతులు చెప్తారా?.. మంత్రి ఫైర్?

అధికారుల సహకారం

ఇసుక రీచ్ ల వద్ద అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించకుండా సీసీ కెమెరాలతో నిఘా సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారని పలువురు లారీ డ్రైవర్లు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎండీసీ(TGMDC) అధికారికంగా లోడింగ్ నిర్వహిస్తున్నటువంటి ఇసుక రీచ్ లలో ఆయా జిల్లాల ప్రాజెక్ట్ ఆఫీసర్ల సహకారంతో కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. అధికారుల సహకారం లేకుండా డబ్బులు తీసుకునే అవకాశం ఉండదని, వారి పర్యవేక్షణ లోపించడం వల్లనే అదనపు వసూల్లకు కాంట్రాక్టర్లు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంతమంది ఇసుక రీచ్ ల వద్ద అధికారుల పేర్లు చెప్పి మరీ వసూల్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కేవలం బల్కు ఆర్డర్‌లు

మరోవైపు అధికారులు ఆన్ లైన్ లో జనరల్ బుకింగ్ ఎక్కువ ఇసుక స్టాక్ పెట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం బల్కు ఆర్డర్ లు ఎక్కువగా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. కావాలని అధికారులు బల్కు ఆర్డర్లను ప్రోత్సహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. జనరల్ బుకింగ్ కు స్టాక్ పెట్టాలని పలువురు లారీ యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమవసూళ్లపై నిఘా పెట్టి చర్యలకు ఉపక్రమిస్తారా? లేకుంటే చూసిచూడనట్లు వ్యవహరిస్తారా? అనేది చూడాలి.

అధికారుల సహకారంతోనే అక్రమ వసూళ్లు: సుర్వి రాజు గౌడ్

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎండీసీ అధికారికంగా లోడింగ్ నిర్వహిస్తున్నటువంటి ఇసుక రీచ్ లలో ఆయా జిల్లాల ప్రాజెక్ట్ ఆఫీసర్ల సహకారంతో కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ములుగు జిల్లాలోని అన్ని రీచ్ లలో 3500 నుంచి 4000 రూపాయలు వసూలు చేస్తూ ఇవ్వని డ్రైవర్ల పై కాంట్రాక్టర్లు భౌతిక దాడులు చేస్తున్నారు. లారీకి పట్టా పేరుతో వెయ్యి రూపాయలు, కాంటా పేరుతో 500, సీరియల్ 100 రూపాయలు, పార్కింగ్ వంద , ఇసుక ఎక్కువ తక్కువ వస్తే వేయడానికి 200, తీయడానికి 200 రూపాయలు నిబంధనకు విరుద్ధంగా వసూళ్లు చేస్తున్నారు. లారీ యజమానులను నష్టాలకు గురి చేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమంగా వసూళ్లు చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.

Also Read: KTR on Congress govt: రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్.. కేటీఆర్ సంచలన కామెంట్స్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం