KTR on Congress govt: రైతును అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) అన్నారు. రైతుల(Farmers)కు యూరియా(Urea) సరఫరాలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. పరిపాలన అంటే ఏమిటో తెలియని వారు రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు, కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వం, ముందుచూపు, పకడ్బందీ పాలన అంటే ఏమిటో ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైందని పేర్కొన్నారు.
Also Read: Sridhar Babu on KTR: కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్.. ఎందుకంటే
కేసీఆర్‌కు ఉన్న ముందుచూపు,
చిల్లర రాజకీయాలు తప్ప పరిపాలన తెలియని వారు రాజ్యమేలడం వల్లే రైతుల(Farmers)కు ఈ కష్టాలు, కన్నీళ్లు వచ్చాయని ధ్వజమెత్తారు. గతంలో వ్యవసాయ అధికారులతో కేసీఆర్(KTR) వరుస సమీక్షలు నిర్వహించేవారని, కేంద్రానికి ప్రతి సీజన్‌కు ముందే లెక్కలతో సహా వినతులు సమర్పించే వారని గుర్తు చేశారు. ఏపీలోని నౌకాశ్రయాలకు మన అధికారులను పంపి, సరఫరాను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసేవారని తెలిపారు. కేసీఆర్‌కు ఉన్న ముందుచూపు, దక్షత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం రైతుల(Farmers) కష్టాల పాలు చేస్తున్నదని తీవ్రంగా ఆరోపించారు. పరిపాలనలో కేసీఆర్(KTR)కు ఉన్న అనుభవం, స్పష్టత ప్రస్తుత పాలకులకు లేవని, అందుకే రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Also Read: Viral News: పేమెంట్ ఫెయిల్ కావడంతో భార్యకు తెలిసిపోయిన భర్త సీక్రెట్ శారీరక సంబంధం