Viral News
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: పేమెంట్ ఫెయిల్ కావడంతో భార్యకు తెలిసిపోయిన భర్త సీక్రెట్ శారీరక సంబంధం

Viral News: వివాహేతర శారీరక సంబంధాలను ఎంత గోప్యంగా కొనసాగించినా, టైమ్ బాగోలేకపోతే ఏదో ఒక విధంగా కచ్చితంగా బయటపడతాయి. సీక్రెట్ ఎఫైర్స్ బయటపడ్డాయంటే సంసారాలు బుడుగ్గున మునుగుతాయి. ఈ విధంగా ఇప్పటికే ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇదేకోవకు చెందిన మరో ఘటన వెలుగుచూసింది. కేవలం 200 రూపాయల పేమెంట్ ఫెయిల్ కావడంతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం అతడి భార్యకు (Viral News) తెలిసిపోయింది.

చైనాకు చెందిన ఓ వ్యక్తి, తన ప్రేయసికి ఇచ్చేందుకు గర్భ నిరోధక మాత్రలు (birth control pills) కొనడానికి ఓ ఫార్మసీకి వెళ్లాడు. టాబ్లెట్స్ కూడా తీసుకున్నాడు. మొబైల్ పేమెంట్ ద్వారా 15.8 యువాన్ (చైనా కరెన్సీ) చెల్లించేందుకు ప్రయత్నించాడు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.200లతో సమానం. అయితే, ‘సిస్టమ్ ఎర్రర్’ కారణంగా పేమెంట్ ఫెయిల్ అయింది. దీంతో, ఫార్మసీ సిబ్బంది.. కస్టమర్ మెంబర్‌షిప్ కార్డుతో అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. ఆ ఫోన్ నంబర్‌ను అతడి భార్య ఉపయోగిస్తోంది.

ఆ నంబర్‌కు ఫోన్ చేసిన ఫార్మసీ సిబ్బంది, రూ.200 పేమెంట్ గురించిన వివరాలు తెలిపారు. గర్భ నిరోధక మాత్రలు కొనుగోలు చేశారంటూ వెల్లడించారు. ఒకటికి రెండుసార్లు కనుక్కున్నా ఏమాత్రం తడబాటు లేకుండా ఫార్మసీ సిబ్బంది ఉన్న విషయాన్ని తెలిపారు. ఫోన్ కాల్ వచ్చిన కొద్దిసేపటికే భర్త వివాహేతర సంబంధాన్ని భర్త గుర్తించింది. దీంతో, భర్తతో ఆమె తెగదెంపులు చేసుకుంది.

Read Also- Sanju Samson’s Wife: ఆసియా కప్‌కు ముందు సంజూ శాంసన్‌పై భార్య చారులత కీలక అప్‌డేట్!

ఈ ఘటన చైనా‌లోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న యాంగ్‌జియాంగ్‌లో జరిగింది. ఈ పరిణామంపై గర్భ నిరోధక మాత్రలు కొనుగోలు చేసిన వ్యక్తి స్పందిస్తూ, ఫార్మసీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘మీ వల్ల రెండు కుటుంబాలు నాశనమయ్యాయి’’ అంటూ ఫార్మసీ సిబ్బందిపై నిందవేశాడు. ఈ వ్యవహారం పోలీసు స్టేషన్ వరకు కూడా చేరింది. ఈ మేరకు ఆగస్టు 12న స్థానిక పోలీస్ స్టేషన్ ఒక రిపోర్టును కూడా రిలీజ్ చేసింది.

తప్పు ఎవరిది?
ఫార్మసీ సిబ్బంది ప్రమేయం ఉన్న ఈఘటనపై న్యాయనిపుణుడు ఫు జియాన్ (Fu Jian) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, కానీ, అది చాలా కష్టమని ఆయన తెలిపారు. కుటుంబాలు తల్లకిందులయ్యేందుకు అసలు కారణం అతడి వివాహేతర సంబంధమేనని, దీని బాధ్యతను అతడే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే, ఫార్మసీ గోప్యత నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే, వారు కూడా చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Read Also- Parliament Security Breach: గోడ దూకి పార్లమెంట్ భవనం ఆవరణలోకి ప్రవేశించిన వ్యక్తి

ఫార్మసీ సిబ్బంది చేసిన కాల్ కారణంగానే అతడి వివాహ సంబంధం చెడిపోయినట్టుగా ఆ వ్యక్తి స్పష్టమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని చైనా న్యాయనిపుణుడు ఫు జియాన్ పేర్కొన్నారు. గుర్తించాల్సిన మరో విషయం ఏంటంటే, ఫార్మసీ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా అతడి గోప్యతను బహిర్గతం చేయాలేదని, అసలు ఆ ఉద్దేశం కూడా లేకుండా జరిగిందన్నారు. కాబట్టి, ఫార్మసీ గోప్యత హక్కుల ఉల్లంఘన జరిగినట్టు చట్టపరంగా నిరూపించడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. మొబైల్ పేమెంట్ ఫెయిల్ కావడం, ఫార్మసీసిబ్బంది పొరపాటుగా భార్యకి కాల్ చేయడం, వాస్తవాన్ని వెల్లడించిన ఈ పరిణామం చైనాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది