Sanju Samson’s Wife: టీమిండియా టీ20 బ్యాటర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇటీవలే ప్రకటించిన ఆసియా కప్-2025 టీమ్‌లో చోటుదక్కించుకున్నాడు. ఇక సెప్టెంబర్ 9న యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. అయితే, టోర్నీ ప్రారంభం కావడానికి కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉన్నసమయంలో సంజూ శాంసన్ భార్య చారులతా రమేశ్ (Sanju Samson’s Wife) కీలక అప్‌డేట్ ఇచ్చింది.
గురువారం నాడు (ఆగస్టు 21) సంజూ శాంసన్ ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఫొటోని ఆమె షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె షేర్ చేయగా, సంజూ ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. కేరళ క్రికెట్ లీగ్‌లో ఆ రోజు రాత్రి మ్యాచ్ ఆడడానికి ముందు, సాయంత్రం 3 గంటల సమయంలో శాంసన్ ఆసుపత్రిలో ఉన్నాడంటూ చారులత పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి జరిగిన మ్యాచ్‌కు కూడా వెళ్లాడంటూ ఆమె వెల్లడించారు. ‘దట్స్ మై బాయ్’ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు.
Read Also- Parliament Security Breach: గోడ దూకి పార్లమెంట్ భవనం ఆవరణలోకి ప్రవేశించిన వ్యక్తి
అభిమానుల ఆందోళన
అయితే, అనారోగ్య సమస్య ఏమిటనేది పేర్కొనకపోవడంతో శాంసన్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లాడన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, సమస్య తీవ్రమైనది అయితే మాత్రం, బీసీసీఐ సెలక్టర్లు, భారత క్రికెట్ జట్టుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. శాంసన్ ప్రస్తుతం టీమిండియాకు అభిషేక్ శర్మతో కలిసి టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా ఆడుతున్న విషయం తెలిసిందే.
కాగా, కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో సంజూ శాంసన్ కోచి బ్లూ టైగర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆగస్టు 21న జరిగిన టోర్నీలో రెండో మ్యాచ్‌లో అదానీ త్రివేంద్రం రాయల్స్‌పై కోచి బ్లూ టైగర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శాంసన్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. అయినప్పటికీ, మ్యాచ్ రోజున సాయంత్రం 3 గంటలకు ఆసుపత్రిలో ఉండి, ఆ తర్వాత సాయంత్రం 7:45 గంటలకు మ్యాచ్ ఆడేందుకు మైదానానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Read Also- BCCI on Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌పై అధికారిక ప్రకటన చేసిన బీసీసీఐ!
కేసీఎల్ ఎలా రాణిస్తాడో!
బ్యాటింగ్ పరంగా చూస్తే, సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌తో సంజూ శాంసన్ కేసీఎల్ (KCL) టోర్నీలోకి అడుగు పెట్టాడు. గత వారం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ ఫ్రెండ్లీ టీ20 మ్యాచ్‌లో కెరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) సెక్రటరీ XI జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్ ఛేజింగ్‌లో సంజు శాంసన్ (కెప్టెన్) 36 బంతుల్లోనే 54 పరుగులు రాబట్టాడు. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లింది. అయితే, చివరిలో బాసిల్ థాంపీ అనే యువ ప్లేయర్ భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. కాగా, ఆసియా కప్ 2025లో సంజూ శాంసన్ ఎలా రాణిస్తాడనేది చూడాలి.