Local Body Election: రిజర్వేషన్ ప్రక్రియ షురూ..
Local Body Election ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Local Body Election: నేడో రేపో సర్పంచ్ వార్డు మెంబర్ రిజర్వేషన్లు విడుదల!

Local Body Election: రెండేళ్లుగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రిజర్వేషన్ల (Reservation) ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 26న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తుండగా, ప్రభుత్వం జారీ చేసిన జీవో 49 ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టి ఖరారు చేయాలని సూచించింది. దీంతో నేడో, రేపో సర్పంచ్, వార్డు మెంబర్ రిజర్వేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఈ రిజర్వేషన్ ప్రక్రియ మండలంలోని ఎంపీడీఓ నేతృత్వంలో, పార్టీల నాయకుల సమక్షంలో డ్రా పద్ధతిలో చేపట్టాలి. ఇప్పటికే అందుబాటులో ఉన్న అధికారులు డ్రా పద్ధతితో రిజర్వేషన్లను కేటాయించినట్లు సమాచారం.

పాత పద్ధతితోనే..

గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం–2018 తీసుకొచ్చినప్పటికీ, ఈ ప్రభుత్వం రెండు ఒకే ధపా ఆమోదం జరిగేలా రిజర్వేషన్లు చేయాలని సవరణ బిల్లు–2024కు అసెంబ్లీలో ఆమోదం పొందింది. అయినప్పటికీ గవర్నర్, రాష్ట్రపతి, పార్లమెంట్‌లో అనుకూలంగా లేకపోవడంతో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్ మించకుండా పాత పద్ధతితోనే ఎన్నికలకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో ముందుకు పోవాలని తీవ్రంగా కృషి చేసినప్పటికీ, రాజ్యాంగ చట్టానికి లోబడి పనిచేయాలనే కారణంతో కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుంది.

Also Read: Local Body Elections: లోకల్ ఫైట్‌లో కాంగ్రెస్ మెగా ప్లాన్.. స్వయంగా సీఎం రేవంత్ మానిటరింగ్..!

ఆశావహుల్లో ఆందోళన..

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే నాయకులు, అభ్యర్థులు ఇప్పటికే సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ప్రజలకు దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది గతంలో ఉన్న రిజర్వేషన్లు కొనసాగవచ్చనే ఆలోచనతో స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రైవేట్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆశావహుల మనసుల్లో ఆందోళన మొదలైంది. రోటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ జరిగితే చాలా మంది తమ పంథాను మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఎస్టీల రిజర్వేషన్ తర్వాతే..

రిజర్వేషన్ ప్రక్రియను ప్రథమంగా ఎస్టీ ప్రాంతాలను ఎంపిక చేసి, ఆ తర్వాత ఎస్టీ రిజర్వేషన్ ఖరారు చేస్తారు. ఆ తర్వాతే ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ ప్రక్రియ ఆధారంగా రోటేషన్‌లో సీట్లను కేటాయిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని అమన్‌గల్లు, తలకొండపల్లి, మాడ్గుల, మంచాల, కందుకూర్ మండలాలు, వికారాబాద్‌లోని బోంరాస్‌పేట్, యాలాల్, దుద్యాల మండలాల్లో అత్యధికంగా ఎస్టీలు ఉండే అవకాశం ఉంది. ఈ మండలాలకు గిరిజన ప్రాంతాలు అండగా ఉంటాయి. ఇక్కడి నుంచే మొదటగా ఎస్టీలకు రిజర్వేషన్ ప్రక్రియ కల్పిస్తారు.

జిల్లాలోని స్థానిక సంస్థల వివరాలు..

జిల్లా రంగారెడ్డి 531  పంచాయతీలు 4,710 వార్డు మెంబర్స్
వికారాబాద్ 594 పంచాయతీలు 5, 058 వార్డు మెంబర్స్

Also Read: Local Body Elections: 3 విడుతల్లో పంచాయతీ ఎన్నికలు.. డిసెంబర్ ఈ తేదీల్లో నిర్వహణ?

Just In

01

Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Sivaji: నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది ప్రేక్షకులే చెప్పాలి

Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!

West Bengal Sports Minister: మెస్సీ ఈవెంట్ ఎఫెక్ట్.. క్రీడల మంత్రి రాజీనామా.. ఆమోదించిన సీఎం