Local Body Elections: లోకల్ ఫైట్‌లో కాంగ్రెస్ మెగా ప్లాన్..!
Local Body Elections (imagecredit:twitter)
Telangana News

Local Body Elections: లోకల్ ఫైట్‌లో కాంగ్రెస్ మెగా ప్లాన్.. స్వయంగా సీఎం రేవంత్ మానిటరింగ్..!

Local Body Elections: రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నిక(local body elections)ల్లో 90 శాతం సీట్లు సాధించాలనే భారీ లక్ష్యాన్ని టీపీసీసీ(TPCC) నిర్దేశించుకున్నది. సర్పంచ్, ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకుని, తద్వారా ఎక్కువ సంఖ్యలో ఎంపీపీ(MPP), జెడ్పీ(ZP) పీఠాలను దక్కించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తొలి విడతగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల తీర్పును అంచనా వేయడానికి ఈ ఎన్నికలు తొలి టెస్ట్‌గా నిలవనున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తరహాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రతి సెగ్మెంట్‌లోని గ్రామ పంచాయితీలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జూబ్లీహిల్స్ లాంటి క్లిష్టమైన స్థానాల్లో విజయం సాధించడానికి అనుసరించిన పటిష్టమైన గ్రౌండ్‌వర్క్, కచ్చితమైన పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

Also Read: Jagriti Janam Baata: సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ మైన్‌ను సందర్శించిన కవిత.. కీలక వ్యాఖ్యలు

సమన్వయం ఇలా..

క్షేత్రస్థాయిలో జరిగే ఈ కీలక పోరులో గెలుపు కోసం పార్టీ యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జిల్లాల ఇన్‌ఛార్జులుగా ఉన్న మంత్రులకు వారి పరిధిలోని గ్రామ పంచాయితీలన్నీ గెలిపించే ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. విజయం సాధించాల్సిన స్థానాల సంఖ్యపై వారికి స్పష్టమైన టార్గెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ బలహీనంగా ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి పార్టీ కమిటీలను రంగంలోకి దించనున్నారు. సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తులు లేనందున, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, పార్టీకి లాభం జరిగేలా అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నించనున్నారు.

సీఎం స్వయంగా మానిటరింగ్

గతంలో హామీ ఇచ్చినట్లే, ఈ స్థానిక ఎన్నికల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పంచాయతీల పరిస్థితిపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన దిశానిర్దేశం, ప్రేరణను సీఎం అందించనున్నారు.

Also Read: Chain Snatching: ఎంతకు తెగించార్రా.. ఉదయాన్నే బరితెగించిన చైన్ స్నాచర్స్

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!