Mahabubabad Police: తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించడం, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపు కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ ఆధ్వర్యంలో 02.12.2025న నిర్వహించిన “ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్” ప్రారంభోత్సవ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. డిజిపి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని యూనిట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త “ఫ్రాడ్ క ఫుల్ స్టాప్ ” ఆరు వారాల సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్ ముఖ్యఅతిథిగా హాజరై పోస్టర్స్ ఆవిష్కరించి విద్యార్థులతొ కలసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. “సైబర్ మోసాలు రోజురోజుకు కొత్త పద్ధతులతో పెరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఇంటికీ, ప్రతి విద్యార్థికీ, ప్రతి ఉద్యోగికీ సైబర్ జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. ఈ 6 వారాల రాష్ట్రవ్యాప్త కార్యక్రమం ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహబూబాబాద్ జిల్లా కూడా ఈ డ్రైవ్‌ను అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తుంది” అని తెలిపారు. “ఓ చిన్న క్లిక్… ఓ చిన్న నమ్మకం… మనుషులను లక్షలు కోట్లు కోల్పోవడానికి దారి తీస్తోందన్నారు. అందుకే తెలియని లింక్స్, తెలియని కాల్స్, తెలియని అప్లికేషన్స్ నేరగాళ్ల వల అని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు.
క్యాంపెయిన్ 6-వారాల థీంలు
1వ వారం — సైబర్ సారథి @1930 ,1930 హెల్ప్‌లైన్, గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ ప్రాముఖ్యత
2వ వారం — స్కాం సే బాచో డిజిటల్ అరెస్టులు, సెక్స్టర్షన్, సైబర్ స్లేవరీ
3వ వారం — పైసా పీలం ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్, లోన్ యాప్ మోసాలు
4వ వారం — హర్ స్క్రీన్ సురక్షిత్ హ్యాకింగ్, ర్యాన్సమ్‌వేర్, ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ ప్రమాదాలు
5వ వారం — మేర లాగిన్ మేర రూల్ ఐడెంటిటీ థెఫ్ట్, ఓటీపీ/కె వై సి మోసాలు
6వ వారం — విమెన్ & చైల్డ్ సేఫ్టీ డేటింగ్ యాప్ ట్రాపింగ్, సైబర్ బులీయింగ్, సైబర్ స్టాకింగ్ జిల్లాలో చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు
Also Read: Sarpanch Candidate: మహిళలకు రూ.1 లక్ష.. పండుగకు రూ.20 వేలు.. సర్పంచ్ అభ్యర్థి వరాల జల్లు!
కాలేజీలలో ప్రత్యేక క్లాస్‌లు
పోలీస్ స్టేషన్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్లలో మాస్ అవగాహన స్కూల్స్, కాలేజీలలో ప్రత్యేక క్లాస్‌లు & ఇంటరాక్టివ్ సెషన్లు, షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, ఆడియో క్లిప్స్, జింగిల్స్, ఫ్లాష్ మాబ్స్ విద్యార్థుల కోసం పోస్టర్/మ్యూరల్ పోటీలు ఇన్‌ఫ్లూయెన్సర్లతో అవగాహన వీడియోలు, క్యూ అర్ ఆధారిత అవగాహన పోస్టర్లు, రియల్ టైమ్ సైబర్ మానిటరింగ్ & రాపిడ్ యాక్షన్ టీమ్స్ ను ఎర్పాటు చేయనున్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కి కాల్ చేయాలన్నారు. అదే సమయంలో NCRP పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. www.cybercrime.gov.in.NCRP లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీసులు & బ్యాంక్ టీమ్‌లు వెంటనే పని ప్రారంభిస్తాయని అన్నారు.
ప్రజలకు విజ్ఞప్తిగా..
ఏ అనుమానాస్పద లింక్, మెసేజ్, కాల్ నమ్మకండి. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేసి, NCRP లో ఫిర్యాదు చేయండి. మీ జాగ్రత్తే మీ భద్రత” అని స్పష్టం చేశారు. మహబూబాబాద్ పోలీస్ సైబర్ మోసాలకు ‘ఫుల్ స్టాప్ ’ పెట్టడానికి సిద్ధంగా ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతి రావు(DSP Tirupati Rao), గండ్రతి మోహన్,సీఐ మహేందర్ రెడ్డి ఎస్.ఐ కరుణాకర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఎన్.సీ.సీ కాడేట్స్, భరోసా, కళాబృందం సిబ్బంది పాల్గొన్నారు.

