Workers Protest (image credit: swetha reporter)
నార్త్ తెలంగాణ

Workers Protest: జీతం తగ్గి పని భారం పెరిగింది.. కాంటినింజెంట్ వర్కర్ల ఆందోళన

Workers Protest: జీతం తగ్గి తమ జీవితాలపై భారం పెరిగిందని రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల హాస్టల్లో వంట మనుషులుగా పనిచేసే 3652 మంది కాంటినింజెంట్ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వర్కర్లు తమ గోడును వెల్లబోసుకున్నారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంటినింజెంట్ వర్కర్ల కోసం ప్రత్యేక జీవో తీసి జీతాలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం కూలిపోయేదాకా తమ కూలి బతుకులకు ఆధారం లేకుండా చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2021 సంవత్సరంలో తీసిన జీవో 64 ను 2024 ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి కాంటినింజెంట్ వర్కర్లుగా ఆమోదం తెలిపిందని తెలిపారు. నాటి నుంచి సజావుగా సాగుతున్న తమ జీవితంలో ఆగస్టు 2024 తర్వాత నుంచి తమ జీతాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Rajasthan News: ఆస్పత్రిలో ఘోరం.. ఐసీయూలో చెలరేగిన మంటలు..ఆహుతైన అగ్నికి పేషెంట్లు

కంటే ముందు మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే

2024 ఆగస్టు కాంటినింజెంట్ వర్కర్ల కు రోజువారి వేతనం రూ.515 ఉండేదని, 2024 సెప్టెంబర్ నుంచి తమ జీతాలు రూ. 390 కి తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 25 రోజులుగా నిరవధిక సమ్మెను చేస్తున్న కాంటినింజెంట్ వర్కర్లు వివిధ జిల్లాల్లో వేరువేరు జీతాలు ఇస్తూ మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో మాత్రం రోజువారీగా రూ.390 ఇస్తూ తమ జీవితాలకు భరోసా లేకుండా పోతుందని తమ గోడును ప్రభుత్వానికి వెల్లబోసుకుంటున్నారు.

జిల్లాకో రకమైన జీతాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో పనిచేసే కాంటినింజెంట్ వర్కర్లకు సేమ్ పని ఉంటుందని, అలాంటప్పుడు జిల్లాకో రకమైన జీతం అందిస్తూ వర్కర్ల జీవితాల్లో ఆందోళన సృష్టిస్తున్నారని, ఈ చర్యతో మా జీవితాలు ఇబ్బందులకు గురవుతున్నాయని చెబుతున్నారు. ములుగు జిల్లాలో రూ.21000 వరంగల్ జిల్లాలో రూ.18,600 నల్గొండ జిల్లాలో టైం స్కేల్ వర్తింపజేస్తూ బేసిక్ జీతమే రూ.19000 ఇస్తున్నారని వెల్లడించారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో పనిచేసే కాంటినింజెంట్ వర్కర్లకు మాత్రం రూ. 390 రోజు వారి వేతనం ఇస్తూ, నెలవారీగా రూ. 11700 ఇస్తూ గతంలో వచ్చే జీతాల కంటే తక్కువ ఇస్తుండడంతో జీతం తగ్గిపోయి పని భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని హైదరాబాదులోని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, డిటిడిఓ దేశి రామ్ నాయకులకు వినతి పత్రాలు అందించామని తెలిపారు.

మెనూ చార్ట్ పెరిగింది.. జీతాలు తగ్గాయి

విద్యార్థులకు భోజనాలు పెంచే మెనూ చార్ట్ పెరిగిందని దీంతో పని భారం ఉదయం 6 గంటలకు రాత్రి 8 గంటల వరకు విరామం లేకుండా పని చేస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల హాస్టల్లో పనిచేసే విధంగానే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేసే కాంటినింజెంట్ వర్కర్లకు కూడా టైమ్ స్కేల్ వర్తింపజేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Also ReadCyber Crime: అత్యాశకు పోయారా? అంతే సంగతులు.. పంజా విసురుతున్న సైబర్ మోసగాళ్లు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!