Rajasthan News (Image Source: Twitter)
జాతీయం

Rajasthan News: ఆస్పత్రిలో ఘోరం.. ఐసీయూలో చెలరేగిన మంటలు..ఆహుతైన అగ్నికి పేషెంట్లు

Rajasthan News: రాజస్థాన్ జైపూర్ లోని సావాయి మాన్ సింగ్ ఆస్పత్రి (Sawai Man Singh Hospital)లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ట్రామా సెంటర్ లో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో ఉన్న ఆరుగురు పేషెంట్లు మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఐసీయూలో 11 మంది రోగులు

ట్రామా సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఐసీయూలో 11 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. స్టోరేజ్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు మృతులను పింటూ, దిలీప్, శ్రీనాథ్, రుక్మిణి, ఖుర్మా, బహదూర్ గా గుర్తించినట్లు తెలిపారు. అయితే పక్కన ఉన్న మరో ఐసీయూలో 14 మంది రోగులు చికిత్స పొందుతున్నారని.. వారందరినీ సురక్షితంగా కాపాడినట్లు వివరించారు.

ఐసీయూ పరికరాలు దగ్దం

మరోవైపు అగ్ని ప్రమాదం కారణంగా.. సావాయి మాన్ సింగ్ ఆస్పత్రి భవనంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పొగ వేగంగా వ్యాపించడంతో ఆస్పత్రిలోని మిగతా రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళనలు చెలరేగాయి. పేషెంట్లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, ఐసీయూ పరికరాలు, రక్త నమూనా ట్యూబులు, ఇతర వస్తువులు మంటల్లో దగ్ధమైనట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. రోగులు, వారి బంధువులను మంటల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను 2 గంటల్లోనే అదుపులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.

ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?

ఆసుపత్రి వార్డ్ బాయ్ వికాస్ మాట్లాడుతూ ‘మేము ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం గురించి తెలిసింది. వెంటనే లోపలికి వెళ్లి రోగులను రక్షించడానికి ప్రయత్నించాం. ముగ్గురు లేదా నలుగురిని రక్షించగలిగాం. కానీ మంటలు పెరిగిన తర్వాత లోపలికి వెళ్లడం సాధ్యం కాలేదు’ అని చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ తర్వాత ఆస్పత్రి వద్దకు ప్రవేశించినప్పటికీ మంటలు, పొగ ఎక్కువగా ఉండటంతో వార్డులోకి ప్రవేశించలేకపోయినట్లు వివరించారు.

Also Read: Gold Rate Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

సీఎం సమీక్ష

మరోవైపు ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం భజన్ లాల్ శర్మ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి జవహర్ సింగ్, ఎంపీ జోగారాం పటేల్ తో కలిసి ట్రామా సెంటర్ కు చెరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముందుగా హోమంత్రి, ఎంపీ ఆస్పత్రి వద్దకు చేరుకోగా వారి వద్ద పేషెంట్లు, బంధువులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద సమయంలో ఆస్పత్రి సిబ్బంది పారిపోయారని పేర్కొన్నారు. అలాగే ప్రమాదం జరిగిన విషయాన్ని కూడా ఇతర వార్డుల్లోని పేషెంట్లకు తెలియజేయలేదని వాపోయారు. ‘పొగ వస్తోంది.. ఎందుకు?’ అని ప్రశ్నించినా సిబ్బంది పట్టించుకోలేదని ఒక బంధువు చెప్పుకొచ్చారు.

Also Read: Wedding: ఇది ఆరంభం మాత్రమే సోదరా.. ముందుంది ముసళ్ల పండగ.. పెళ్ళికి రూ.15 లక్షలు ఉండాల్సిందేనా.. వీడియో వైరల్

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?