Warangal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal District: ఓరుగల్లుతో అందెశ్రీ ది విడదీయరాని బంధం.. ఆయన సేవలు చిరస్మనీయం అంటూ..!

Warangal District: పేదరికం నుంచి గొప్ప కవిగా ఎదిగి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందెశ్రీ(65) సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి పోరుగల్లు గొల్లుమంది, ఆయనతో వరంగల్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకులు డా.బండ ప్రకాష్, బన్న ఐలయ్య, ఆకుల నాగేశ్వరరావు, ప్రసాద్ రావు వంటి వారు తమతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షల మెదళ్లను కదిలించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయువు పట్టుగా ఆయన రాసిన ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గోంతుకలు ఒక్కటైన ఈక్షణం..’ పాట నిలిచిందని జ్ఞాపకం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినివ్వడమే కాకుండా, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసింది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పాటలు, ఆశయాలు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయనడంలో సందేహం లేదు. ఆయన మరణం ఓరుగల్లుకే కాదు, యావత్ తెలంగాణకు తీరని లోటు అని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

వ్యవసాయ పనులు చేసుకుంటు..

పోరాటాల ఖిల్లా ఓరుగల్లుతో అందె శ్రీ ది విడదీయారని బంధం అని జిల్లా వాసులు కొనియాడారు. వరంగల్ గడ్డమీద పుట్టిన మహా కవి అని ప్రశంసిస్తున్నారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. నిరుపేద దళిత కుటుంబంలో పెరిగి,తన ఇంటి సమీపంలో ఉండే అగ్రవర్ణ రైతు దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటు సాహిత్యం, కథలు, మహాభారతం, రామాయణం వంటి కథలు నేర్చుకున్నాడు, పాఠశాల విద్యకు దూరమైనప్పటికీ, తన చుట్టూ ఉన్న ప్రకృతి, పల్లె జీవితాలను పరిశీలిస్తూ అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఆ అనుభవాలే ఆయన కవిగా మార్చాయి. చదువుకోకున్నా అద్భుతమైన రచనలు చేస్తున్న ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

Also Read: Uttam Kumar Reddy: చరిత్ర సృష్టించిన తెలంగాణ సర్కార్.. ధాన్యం కొనుగోళ్లలో అరుదైన మైలురాయి

వరంగల్ అంటే ఆయనకు మమకారం ఎక్కువ. వరంగల్ కు వచ్చినప్పుడల్లా మేడారం కు వెళ్లేవారని అయన సన్నిహితులు పలువురు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ వేదికగా జరిగిన పలు కార్యక్రమాల్లో అందేశ్రీ పాల్గొన్నారు. ఇక్కడి కళాకారులు, రచయితలతో సమావేశమై ఉద్యమానికి తన పాటల ద్వారా దిశానిర్దేశం చేసేవారు. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ‘పోలికేక’ వంటి కార్యక్రమాలలో పాల్గొని తన పాటలతో విద్యార్థులలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. ‘గలగలగలగల గజ్జెలబండి.. వంటి ఓరుగల్లు వైభవాన్ని కీర్తిస్తూ రాశారని సాహితీ ప్రియులు గుర్తుచేస్తున్నారు.

ఆయన పాటకు గుర్తింపు..

పేదరికం నుంచి వచ్చినప్పటికీ తన సాహిత్యం తో ఉన్నత స్థానానికి చేరిన కవి అందెశ్రీ. అయినప్పటికీ ఆయన బలగంలో సామాన్యులు, స్నేహితులే ఎక్కువ ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు.. గత ప్రభుత్వం లో ఆయన పాటకు గుర్తింపు లభించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన పాటకు సముచిత గౌరవం దక్కిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నారు.

వరంగల్ అంటే మమకారమెక్కువ… వనదేవతలు

వరంగల్ అంటే అందెశ్రీకి మమకారం ఎక్కువ. పాలకులు ప్రభుత్వ భూమిని అమ్మినప్పుడల్లా ఆయన బాధపడేవారు. పలుకుబడి, డబ్బు ఉన్నవారికంటే అతిసామాన్యులతోనే ఆయన స్నేహం చేసేవారు. గత 20 ఏళ్ల నుంచి వైద్యం కోసం నా దగ్గరికి వచ్చేవారు. ఆయన రాసిన ‘నిప్పులవాగు’ పుస్తకాన్ని నాకు బహుకరించారు. ఆయన స్వహస్తాలతో పుస్తకంలో రాసి, ఆటోగ్రాఫ్ ఇచ్చారు. గత 15 రోజుల క్రితం మేడారం లో వనదేవతలను దర్శించుకుని,నన్ను కలిసి వెళ్ళారు. డాక్టర్.వంగాల శ్రీనివాస్ రెడ్డి, హోమియో వైద్యులు తెలిపారు

Also Read: Delhi Explosion: దిల్లీ బ్లాస్ట్‌పై సీపీ స్పందనిదే.. దర్యాప్తుకు ఆదేశించిన హోం మినిస్టర్.

Just In

01

Gadwal Police: మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకే హత్య!

Jackie Chan death rumors: సోషల్ మీడియా నన్ను చాలా సార్లు చంపేసింది.. జాకీచాన్

Viral Video: మాజీ మంత్రిని కదిలించిన ఓ కుర్రాడి ఇంస్టాగ్రామ్ వీడియో..!

Telangana Police: ఆలయాల్లో చోరీలు.. అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్.. ఎన్ని లక్షలు స్వాధీనం చేసుకున్నారంటే?

TTD Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. మాజీ ఈవో ధర్మారెడ్డిపై ప్రశ్నల వర్షం!