Mahabubabad: 20 అప్లికేషన్లు పెట్టుకున్నా ఒక్క మద్యం షాపు వస్తే చాలు అనే కోణంలోనే సిండికేట్ గా వ్యాపారస్తులు ఒక్కటయ్యారు. మద్యం షాపులు వరించిన వారిలో అత్యధికంగా సిండికేట్ వ్యక్తులకే చెందడం గమనార్హం. అయితే ఇందులో అత్యధికంగా కొత్తగా వ్యాపారం లోకి దిగిన సిండికేట్లే కావడం విశేషం. మద్యం షాపుల టెండర్లలో సింగిల్ గా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మద్యం షాపులు దక్కాయి. 20 నుంచి దాదాపు 30 వరకు దరఖాస్తులు సిండికేట్ గా ఏర్పడి దాఖలు చేశారు. ఇందులో అత్యధికంగా కొత్త కొత్త మొఖాలు కనిపించాయి. మహబూబాబాద్ జిల్లాలో పాత మద్యం వ్యాపారస్తులకు దాదాపు అందరికీ ఒకటి నుంచి రెండు షాపులు దక్కాయి. మరి కొందరికి దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. అదేవిధంగా కొత్తగా ఇండివిడ్వల్ గా దరఖాస్తు లు ఎక్కువగానే దాఖలు అయ్యాయి.
Also Read: Mahabubabad: రాష్ట్రంలో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. రూ.3 లక్షలకు సెటిల్‌మెంట్!
ఒక్క మద్యం షాపు విలువ రూ.60 లక్షల నుంచి కోటి పైగానే
2025 27 మద్యం షాపుల టెండర్లు ఈనెల 23 తో పూర్తయితే లక్కీ డ్రా ఈ నెల 27న అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఇందులో ఎక్కువ టెండర్లు సిండికేట్ వారే దాఖలు చేశారు. వారి ఉద్దేశం ఒక్క మద్యం షాప్ కు 20 నుంచి 30 దరఖాస్తులు వేసిన తక్కువేనని కోణంలోనే ఆలోచించి మరి దరఖాస్తులు దాఖలు చేశారు. ఎందుకంటే లక్కీ డ్రా వరించిన వారి నుంచి కొనుగోలు చేయాలంటే తక్కువల తక్కువ రూ. 60 లక్షల నుండి రూ.1 కోటి వరకు మద్యం షాపుల ధర పలుకుతుంది. సిండికేట్ గా 20 నుంచి 30 దరఖాస్తులు చేసుకున్న వారికి ఒకటి, రెండు, మూడు మద్యం షాపులు దక్కినప్పటికీ మరికొన్ని మద్యం షాపులను లక్కీ డ్రా వరించిన వారికి నుంచి కొనుగోలు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక షాపు, నెల్లికుదురు మండల కేంద్రంలో మరో షాపు రూ.80 లక్షల వరకు ధర పలికే వాటిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది.
షాపులను విక్రయించేందుకే ఉత్సాహం
మద్యం షాపులు దక్కించుకున్న వారంతా లైసెన్స్ కొనుగోలు చేసే సమయం నాటికి దాదాపుగా అన్ని షాపులను విక్రయించేందుకే ఉత్సాహం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క మద్యం షాపు నిర్వహించాలంటే రూ.కోటి ఉంటే మాత్రమే ఆ పని చేయగలరు. ఇది కొంతమంది తహతుకు మించిన భారం కాబట్టి వారంతా వచ్చిన మద్యం షాపులను విక్రయించేందుకే ఎక్కువ శాతం ఆలోచిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కొత్తవారు లైసెన్సుల కోసం ముగ్గు చూపకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం టెండర్ల ద్వారా ఆదాయం సమకూరే అవకాశాలు తక్కువేనని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిండికేట్లుగా ఏర్పడిన వారంతా కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారి నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.
Also Read: Mahabubabad: రాష్ట్రంలో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. రూ.3 లక్షలకు సెటిల్‌మెంట్!
