Swetcha Effect: వరంగల్ స్వేచ్ఛ: హనుమకొండ జిల్లాలో ఎస్.ఆర్.ఎస్.పి(SRSP) కాలువ భూముల ఆక్రమణలపై ఇరిగేషన్ శాఖ(Irrigation Department) అధికారులు కొరడా జిలిపించారు. ఎస్.ఆర్.ఎస్.పి కాలువ పరిధిలోని భూమిలో భూమి(Land) ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేపట్టిన పలు కట్టడాలను గురువారం అధికారులు జేసీబీ(JCB) తో కూల్చివేశారు. హనుమకొండ(Hanmkonda) జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు గ్రామంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(Warangal Municipal Corporation) పరిధిలో కోట్ల రూపాయల విలువైన పుట్టలమ్మ చెరువు, ఎస్.ఆర్.ఎస్. పి. భూములు ఆక్రమణకు గురయ్యాయి.
ఏ ఈ శ్రీనివాస్ మాట్లాడుతూ..
ఈ నేపథ్యంలో ఈనెల 19న కోట్ల విలువైన భూములు కబ్జా అనే శీర్షికన ప్రచురితం ఆయన ప్రత్యేక స్టోరీపై స్పందించిన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం ఇరిగేషన్ శాఖ ఏఈ శ్రీనివాస్(AE Srinivass) ఆధ్వర్యంలో పోలీస్(Police) శాఖ, రెవెన్యూ(Revenue) శాఖల అధికారులు కలిసి అక్రమ కట్టడాలు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఏ ఈ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ ఆర్ ఎస్ పి భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలు తొలగించాలని పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చివేశామన్నారు. కాకతీయ కెనాల్ పక్కనే ఉన్న విలువైన భూమిలో పలువురు పర్మినెంట్ నిర్మాణాలు చేస్తున్నారు. భూములను కాపాడేందుకు ఎస్ ఆర్ ఎస్ పి భూముల చుట్టూ ట్రెంచ్ కొడుతామన్నారు.
ఆక్రమణలు పూర్తిగా తేల్చాలి
అధికారులు మీడియాలో కథనాలు వచ్చినప్పుడు స్పందించి కంటితుడుపు చర్యలు చేపట్టి వదిలేయడం కాకుండా పూర్తిస్థాయిలో ఆక్రమణకు గురైన భూముల వివరాలు పూర్తిగా తేల్చి కబ్జాదారులపై చర్యలు తీసుకుని కోట్ల విలువైన భూములు కాపాడాలని నగర ప్రజలు కోరుతున్నారు.
Also Read: TG Govt Schools: ప్రభుత్వ పాఠశాలలో చదువుకు ప్రయత్నం