TG Govt Schools: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలు వట్టి మాటలకే పరిమితమవుతున్నాయి. అడ్మిషన్ల పెంచేందుకు బడి బాట వంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో క్రమంగా సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. అప్పులైనా సరే భరిస్తూ మరీ పేరెంట్స్ ప్రైవేట్, ఇతర కార్పొరేట్ స్కూళ్లకు తమ పిల్లలను పంపిస్తున్నారు. దీనికి ప్రభుత్వ స్కూళ్లలో సరిగ్గా చదువు చెప్పరనే కారణం ప్రధానమైంది. అంతేకాకుండా తరగతి గదులు, టాయిలెట్లు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం మరో కారణం. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నా అక్కడికి పంపించకుండా ప్రైవేట్ స్కూళ్లకు పంపించడం గమనార్హం. ప్రైవేట్ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు లేకున్నా అక్కడికే పంపించడం పరిశీలించదగిన అంశం. ఇకపోతే.. కొందరు పేరెంట్స్ మాత్రం గొప్పలకు పోయి మరీ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో వేస్తుండటం గమనార్హం.
ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలు
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య 60 లక్షలుగా ఉంది. కాగా తెలంగాణలో మొత్తం ప్రభుత్వ స్కూళ్లు(ప్రభుత్వ, ఎయిడెడ్, లోకల్ బాడీ) 26,109 ఉన్నాయి. కాగా అందులో దాదాపు 16 లక్షల 70 వేల మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. గురుకులాల్లో దాదాపు 4 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇక కేజీబీవీల్లో 1 లక్ష మంది ఉంటారు. మోడల్ స్కూళ్లలో 90 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇకపోతే రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్ స్కూళ్లు 11,156 ఉండగా.. వాటిలో చదివే విద్యార్థుల సంఖ్య మొత్తం 37.50 లక్షలు ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలుగా గుర్తింపు పొందిన 13 స్కూళ్లలోనే దాదాపు 4.8 లక్షల మంది విద్యార్థులుండటం గమనార్హం. ఇకపోతే.. తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో చదువు బాగుంటుందని గుర్తింపు పొందిన దాదాపు 60 సర్కార్ బడుల్లో ఒక్కో స్కూల్ లో సగటున 1000 మంది విద్యార్థుల చొప్పున 60 వేల మంది ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ 60 స్కూళ్లలో విద్య ప్రమాణాలు మెరుగ్గా ఉన్నట్లే ఇతర ప్రభుత్వ స్కూళ్లలోనూ ఉంటే గణనీయంగా అడ్మిషన్లు పెరిగేందుకు అవకాశం ఉండేది.
Also Read: Warangal Airport: ఎయిర్ పోర్టు భూ నిర్వాసితుల ధర్నా.. పరిహారం ఇవ్వాలని డిమాండ్?
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల
విద్యావ్యవస్థలో మార్పులు రావాలని అందరూ కోరుకునే వారే. కానీ దాన్ని అమలు చేసే పాపాన మాత్రం ఒక్కరూ వెళ్లకపోవడమే ఈ దుస్థితికి కారణమని జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తెలంగాణలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా నిర్మాణాన్ని సైతం ప్రారంభించింది. ఇప్పటికే అవి పలు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కాగా మొత్తం 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు రూ.21 వేల కోట్లను తెలంగాణ సర్కార్ వెచ్చించనుంది. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవుతాయా? లేదా? అన్నది చూడాల్సిందే..
Also Read: Collectorate: కలెక్టరేట్లో కామాంధుడు…? మద్యం సేవించి.. ఓ చిన్నారి పై?
ప్రముఖ కార్పొరేట్ సంస్థల విద్యార్థుల డేటా
స్కూల్ పేరు స్కూళ్ల సంఖ్య విద్యార్థుల సంఖ్య
శ్రీచైతన్య 226 1,42,000
నారాయణ 107 58,000
ఆల్ఫోర్స్ 21 13,000
భాష్యం 51 26,000
బ్రిలియంట్ 107 34,000
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 22 25,000
ఏకశిల 21 11,000
కాకతీయ స్కూల్స్ 89 36,000
కృష్ణవేణి 204 75,000
మాస్టర్ మైండ్స్ 57 10,000
నాగార్జున 29 15,000
పల్లవి 04 8,800
రవీంద్ర భారతి 26 27,000
మొత్తం 964 480,800