Gadwal News: ధరూర్‌మండలం జాంపల్లి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటిదొడ్డి మండలం నందిన్నెకు చెందిన మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే పక్కా ప్లాన్ తో బొలేరో వాహనంతో ఢీకొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మొదట అందరు రోడ్డు ప్రమాదమే అని భావించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆరోపణ నేపథ్యంలో ప్రీప్లాన్డ్ మర్డర్ గా బలం చేకూరుతోంది. గద్వాలలో పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చిన్న భీమరాయుడిని బొలేరో వాహనంతో ఢికొట్టి సుమారు 250మీటర్ల మేరకు అలాగే ఈడ్చుకుంటు వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సంఘటనను గద్వాల పోలీసులు పరిశీలించి అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద మృతిపై గద్వాల సీఐ టి.శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదమా లేక బొలేరో వాహనంతో ఢీకొట్టి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్లాన్ వేసింది ఎవరూ? రోడ్డు ప్రమాదం వెనుక ఎవరెవరీ పాత్రులున్నాయి? ఒక వేళ సుపారీ గ్యాంగ్ పనే అయితే… వాళ్లకు సుఫారీ ఇచ్చింది ఎవరూ? సుఫారీ గ్యాంగ్ నాయకుడు ఎవరు అనేక అనుమానాలకు గద్వాల పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడుకు గ్రామంలో కొంత మంది భూతగాదాలు, రాజకీయ కక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాద సంఘటనను పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది సుపారీ గ్యాంగ్ పనే అని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు స్పష్టమౌతోంది.
ప్రమాదానికి ముందు..
బొలేరో వాహనంతో మృతుని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఢీకొట్టిన వాహనం ఏపీలోని కర్నూల్ కు చెందిందిగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు కదలికలపై సుపారీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్లు ఈ క్రమంలో శుక్రవారం రోడ్డు ప్రమాదానికి ముందు గద్వాల నుండి నందిన్నెకు వస్తున్న క్రమంలో దారిపోంటి భీమరాయుడుని ఫాలో అవుతు వచ్చారని, జాంపల్లి వద్ద బొలేరో వాహనంతో బైక్ ను ఢీకొట్టిన డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపణలు. ప్రమాదానికి ముందు డ్రైవర్ తో పాటు వచ్చిన వారు ఎందరు, వాళ్లు ఎక్కడకి పరారయ్యారు? రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు ఘటన స్థలంలో ఉన్నవారు గుర్తించారు. సుఫారీ గ్యాంగ్ లో మిగతా వారు మరో వాహనంలో సంఘటన దృశ్యాలను గమనిస్తు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారనే వాదనపై పోలీసుల దర్యాప్తులో తేలనున్నట్లు సమాచారం. హత్యకు ఓ రైస్ మిల్ నిర్వాహకుడే కారకుడనే అనుమానంతో ఆ మిల్లు ముట్టడికి మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తతతకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
Alao Read: Story Writers Decline: తెలుగులో కథా రచయితలు తగ్గిపోతున్నారా.. నాగార్జున చెప్పింది నిజమేనా?
పోలీసుల అదుపులో బొలేరో వాహన డ్రైవర్?
రోడ్డు ప్రమాదానికి కారకుడైన బొలేరో వాహనం డ్రైవర్ ను గద్వాల పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డ్రైవర్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోగ పోన్ పే నంబర్ కు కొంత నగదు వచ్చినట్లు, దీంతో మనీ ట్రాన్స్ ఫర్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడంలో ఎవరెవరు ఉన్నారో పోలీసులు అందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంపై వారి హస్తం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటిదొడ్డి మండలానికి చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తూ, కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే మాజీ సర్పంచ్ మృతికి సుమారు రూ.50లక్షల వరకు రాయలసీమ కు చెందిన ఓ గ్యాంగ్ కు సుఫారీ అందినట్లు జిల్లా కేంద్రంలో బహిరంగానే చర్చించుకుంటున్నారు. సుపారీ ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చారు? మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు మృతి రోడ్డు ప్రమాదమా లేక హత్య అనే విషయంపై గద్వాల పోలీసులను సంప్రదించేందుకు యత్నించగా ఎవరు అందుబాటులోకి రాలేదు.
Also Read: Story Writers Decline: తెలుగులో కథా రచయితలు తగ్గిపోతున్నారా.. నాగార్జున చెప్పింది నిజమేనా?

