SP Shabarish: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి
SP Shabarish ( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

SP Shabarish: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ డాక్టర్ పి శబరీష్

SP Shabarish: మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ (SP Shabarish) తెలిపారు. జిల్లా పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది తొ జిల్లా ఎస్పీ శబరీష్( (SP Shabarish) )వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద శాంతిభద్రతలు దృఢంగా ఉండేలా సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఉదయం నుంచే పోలీసులు తమ స్థానాల్లో చేరి, ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయడానికి అన్ని రకాల సౌకర్యాలు మరియు భద్రతా చర్యలను ఎంచుకుంటారు.

స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు

పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపుల గుమికూడింపులు పూర్తిగా నిషేధిం అన్నారు. అవసరం లేకుండా తిరిగే వ్యక్తులను పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద చర్యలు కనబడితే వెంటనే స్పందించాలని అన్నారు. సెన్సిటివ్ మరియు హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో అదనపు పికెటింగ్, వీడియో రికార్డింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయబడ్డాయి. పోలింగ్ స్టేషన్‌లో ప్రచార సామగ్రి, మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు తీసుకురావడం అనుమతించబడదని తెలిపారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకోసం ప్రత్యేక క్యూలైన్లు అమల్లో ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.

Also Read: Mulugu SP Shabarish: 5S విధానం అమలు చేయాలి.. ములుగు ఎస్పీ కీలక ఆదేశాలు

అప్రతీక్షిత ఘటనలు జరగకుండా నిరంతర నిఘా

పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను కఠిన భద్రతా చర్యల మధ్య రిసీవింగ్ సెంటర్లకు తరలిస్తారు. రూట్ మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉండి, ఎటువంటి అప్రతీక్షిత ఘటనలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు బ్యాలెట్ బాక్స్ రవాణాలో ఉండే ఏ టీమ్‌కైనా తమ స్థానాన్ని విడిచి వెళ్లే అవకాశం లేదన్నారు. పోలీస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, వైర్‌లెస్, VHF సెట్లు పూర్తిగా పని చేయాలి. మొబైల్ పార్టీలు, పికెట్స్, చెక్ పోస్టులు, బాండోబస్తు టీమ్స్ అన్ని సమయాల్లో అలర్ట్‌లో ఉండాలని పేర్కొన్నారు. ఓటర్ల రాకపోకలు, రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ కంట్రోల్ అన్నీ సక్రమంగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఉద్రిక్తత, గుంపుల గుమికూడింపు, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధం

శాంతిభద్రతలను భంగం కలిగించే ఏ వ్యక్తికైనా అవకాశం ఇవ్వొద్దన్నారు. ఎన్నికల కోడ్ దృశ్య ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధం అని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనియా జరుగకుండా ప్రశాంతమైన వాతావరణం లో జరిగేందుకు ఎన్నికల బందోబస్తులో ( 05) డిఎస్పీలు, (16)ఇన్స్పెక్టర్లు, (60) ఎస్.ఐలు మొత్తం 1000 మంది పోలీస్ సిబ్బంది మొదటి విడుత ఎన్నికలలో విధిలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. మొత్తం జిల్లాలోని పౌరులు ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా భావించి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రజలను కోరారు.

Also Read: C. V. Anand: గణేష్ నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య