C. V. Anand( IMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

C. V. Anand: గణేష్ నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

C. V. Anand: గణేష్ నిమజ్జన శోభాయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్(Hyderabad) నగర పోలీస్(Police)  కమిషనర్ సీవీ ఆనంద్(C. V. Anand) వెల్లడించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో చివరి ఘట్టమైన నిమజ్జనాన్ని ఈ నెల 6 వ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు,(Rachakonda Commissioner Sudheer Babu) అదనపు పోలీసు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ జోయల్ డేవిడ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరిలతో కలిసి బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

 Also Read: Kavitha: కవిత వ్యూహాత్మక అడుగులు సస్పెన్షన్ తర్వాత గులాబీ పార్టీకి షాక్?

30 వేల మంది పోలీస్ సిబ్బంది

శోభాయాత్ర రూట్ లో కీలకమైన బాలా పూర్, చార్మినార్ సర్కిల్, మోజాం జాహి మార్కెట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ఊరేగింపు మార్గాలను పరిశీలించి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు ఆధారంగాపోలీస్ కమిషనర్ పలు సూచనలు జారీ చేశారు. నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహాల ఊరేగింపులు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు తదితర అంశాలపై అధికారులుతో చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతవరణంలో జరిగేలా 30 వేల మంది పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరుల శోభాయాత్ర సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇప్పటి వరకు లక్షా 21 వేల 905 విగ్రహాల నిమజ్జనం: జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

ఈ నెల 2 వ తేదీ వరకు వరకూ నగర వ్యాప్తంగా 1,21,905 గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగిందని. ఈ నెల 6 వ తేదీన సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి రానున్నట్లు అంఛనా వేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్ లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశామని వివరించారు. నగరంలోని అన్ని ప్రధాన లేక్ లలో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్ లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 303 కి.మీ.ల నిమజ్జన రూట్ లో మొత్తం 56 వేల ,187 తాత్కాలిక లైట్లను లైట్లు ఏర్పాటు చేశామన్నారు.

14 వేల, 486 మంది శానిటేషన్ వర్కర్స్

హైడ్రా, పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ టీమ్ లను, 200 గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. పోలీసు సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ 14 వేల, 486 మంది శానిటేషన్ వర్కర్స్ ను మూడు షిఫ్టులలో విధులు నిర్వర్తించేలా నియమించినట్లు కమిషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలతో కలిసి సమన్వయంగా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అధికారులకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ నిరంజన్ రెడ్డి, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అధికారులకు నిర్వాహకులుస్వామి వారి కండువా వేసి, ప్రసాదం అందజేశారు.

బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్

బాలాపూర్-కట్ట మైసమ్మ దేవాలయం → కేశవగిరి → చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ → మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ → ఇంజన్ బౌలి → అలియాబాద్ → నాగుల్ చింత జంక్షన్ → హిమ్మత్‌పురా → చార్మినార్ → మదీనా ఎక్స్ రోడ్ → అఫ్జల్ గుంజ్ →మోజాం జాహి మార్కెట్ → అబిడ్స్ జీపీఓ →బీజేఆర్ విగ్రహం→ బషీర్‌బాగ్ క్రాస్ రోడ్డు → లిబర్టీ → అంబేద్కర్ విగ్రహం →హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)

ఖైరతాబాద్ గణేష్ రూట్ మ్యాప్

ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుంచి → పాత పీఎస్ సైఫాబాద్ → ఇక్బాల్ మినార్ →తెలుగు తల్లి → అంబేద్కర్ విగ్రహం → హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)

 Also Read: Mulugu SP Shabarish: 5S విధానం అమలు చేయాలి.. ములుగు ఎస్పీ కీలక ఆదేశాలు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం