SP Shabarish ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

SP Shabarish: ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలపై సదస్సులు నిర్వహించాలి : ఎస్పీ డాక్టర్ పి శబరిష్

SP Shabarish: ములుగు జిల్లాలో అక్రమ రవాణాపై పోలీస్ అధికారులు నిఘా పెంచి ఇసుక రవాణాను అడ్డుకోవాలని ఎస్పీ డాక్టర్ పి శబరిష్ (SP Shabarish )పేర్కొన్నారు. ములుగు జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మొదటగా జిల్లా ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతను కలిగి ఉండాలని, పక్షపాతం లేకుండా సమానత్వం పాటించాలని, బాధితులందరినీ ఒకే విధంగా చూడాలని అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 Also Read:SP Shabarish: జనజీవన స్రవంతిలో కలిస్తే ఆదరిస్తాం.. ఎస్పీ శబరీష్!

కోర్టు కానిస్టేబుల్ లు విధులు నిర్వహించాలి

ఈ సందర్భంగా ఎస్పీ కోర్టులో ట్రయల్ లో ఉన్న కేసుల గురించి ఆరా తీసి, ప్రతికేసులోను తప్పనిసరిగా సాక్షులకు, ముద్దాయిలకు సమన్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులకు శిక్ష పడే విధంగా కోర్టు కానిస్టేబుల్ లు విధులు నిర్వహించాలని, అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్, సస్పెక్ట్ షీటర్స్ గురించి ఆరా తీసి, వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలని, వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్ ల వారీగా ఆరా తీసి, కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతి కేసులోనూ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఫైల్ అప్డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని, పోగొట్టుకున్న నగదు లేదా వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలి అని ఆదేశించారు.

 రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన కల్పించాలి

పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన తీసుకొని వచ్చి కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. మహిళలపై జరిగే నేరాలలో వీలైనంత త్వరగా విచారణ చేసి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. యువత ఆన్లైన్ బెట్టింగ్ వలలో పడి మోసపోకుండా పోలీస్ స్టేషన్ ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ ని ప్రోత్సహిస్తే వల్ల పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేశారు.

విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

యువత, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ క్రైమ్ నేరాలపై ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధి లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్ బి ఇన్స్పెక్టర్ శంకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కుమార్, సిఐ ఏటూరునాగారం శ్రీనివాస్ , సిఐ ములుగు సురేష్, సిఐ వెంకటాపురం రమేష్, సిఐ పస్రా దయాకర్, ఎస్ఐ ములుగు వెంకటేశ్వరరావు, ఎస్ఐ వెంకటాపూర్ రాజు, ఎస్ఐ పస్రా కమలాకర్, ఎస్ఐ తాడ్వాయి శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ ఏటూరునాగారం రాజ్ కుమార్, ఎస్ఐ మంగపేట సురేష్, ఎస్సై కన్నాయిగూడెం వెంకటేష్, ఎస్ఐ వాజేడు సతీష్ , ఎస్ఐ పేరూరు కృష్ణ ప్రసాద్, ఎస్సై వెంకటాపురం తిరుపతి, డిసిఆర్బి ఎస్సై జగదీష్, మరియు ఐటీ కోర్ టీం, డిసిఆర్బి సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Mulugu SP Shabarish: 5S విధానం అమలు చేయాలి.. ములుగు ఎస్పీ కీలక ఆదేశాలు

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?