SP Shabarish: భారత దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు ఆకర్షితులై నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి వివిధ క్యాడర్లలో పనిచేసే 18 మంది లొంగిపోయిన మావోలకు రివార్డులను ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ అందజేశారు. ప్రతి ఒక్కరికి 25 వేల పునరావాసం, అదేవిధంగా ఎవరిపైన ఉన్న రివార్డును వారి బ్యాంకు అకౌంట్లో జమ చేసినట్లు ఎస్పి తెలిపారు.
రివార్డు పొందిన వారి వివరాలు
పూజారి కాంకేర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన కోరం పాపారావు, రౌతు హనుమయ్య, హనుమ మడవి, వ్యక్తి వెంకన్న, మాస కోడి, మడకం దేవా, మడవి జోగా, విరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మజ్జి విజయ, షూరిటీ రవణమ్మ, కొత్తకొండ మజ్జి హైమావతి, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మజ్జి నాగరత్న, మజ్జి తిరుపతమ్మ, మజ్జి సుశీల లకు రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన వారికి అనారోగ్య సమస్యలుంటే వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు.
ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారికి మెరుగైన చికిత్స చేయించడం, వారి పునరావాసానికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందజేయడం లక్ష్యంగా పోలీసులు పనిచేస్తారని వెల్లడించారు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై ఇప్పటికీ అజ్ఞాతంలో ఒగ్గుతున్న వారందరూ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేవారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే ప్రభుత్వం, పోలీస్ శాఖ నుండి అన్ని రకాల సహకారాలు అందుతాయన్నారు.
Also Read: Harish Rao Meets KCR: కాళేశ్వరం నోటీసులపై మల్లాగుల్లాలు.. కేసీఆర్‌తో హరీష్ రెండోసారి భేటి!