Adilabad Cold Wave: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తున్నది. వారం రోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో జిల్లా వాసులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్(Adilabad), కొమురం భీం జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నది.
Also Read: Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!
ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తులు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీ(టి) గ్రామంలో, ఉట్నూర్ ఏజెన్సీలో, కొమురం భీం జిల్లా తీర్యాని మండలం గిన్నెదారి, సిర్పూర్ (యు), లింగాపూర్ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం గిన్నెదారిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. చలి తీవ్రతతో చిన్నపిల్లలు, వృద్ధులు, ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోను విపరీతంగా చలి పంజా విసురుతుంది. అత్యవసరమైతే తప్ప ఎవరు భయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: Tortoise: రాజ్ తరుణ్ మరో ప్రయోగం.. ఈసారి ‘టార్టాయిస్’గా..!
