Minister Seetakka: నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దని, విత్తన చట్టాన్ని రూపొందించుటకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పేర్కొన్నారు. మొక్కజొన్న పంట వేసి ఆర్గనైజర్ల చేతుల్లో మోసపోయిన రైతులకు నష్టపరిహారం కింద చెక్కులను (Minister Seetakka) మంత్రి సీతక్కతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులందరికీ ప్రైవేట్ కంపెనీల ద్వారా నష్టపరిహారం అందించడం జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైంది అన్నారు.
Also Read:Wildness Resort: ఇద్దరు ప్రాణాలను బలిగొన్న విల్డర్నెస్ రిసార్ట్!
రైతులకు పరిహారం అందించేలా కృషి
రాష్ట్రంలోని (Farmers) రైతులకు రూ.1 లక్ష 5 కోట్లను తెలంగాణ రైతులకు అందించి అన్ని విధాలుగా ఆదుకున్నామని అన్నారు. రైతులు విత్తనాలతో మోసపోకుండా రాష్ట్రంలో విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. మరోవైపు, మల్టీ నేషనల్ విత్తన కంపెనీల ఆర్గనైజర్లకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు. నష్టపరిహార చెక్కుల పంపిణీ రైతులు సాధించిన విజయమని పేర్కొన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలతో ఫైట్ చేసి నష్టపరిహారం చెల్లించేలా చేశామన్నారు. ఐదారు కంపెనీలను ఒప్పించి (Farmers) రైతులకు పరిహారం అందించేలా కృషి చేశామని వివరించారు. ఆర్గనైజర్ల ముసుగులో బీఆర్ఎస్ (BRS) నేతలు ఉన్నారన్నారు. రైతులను మోసం చేసే ఆర్గనైజర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
Also Read: SPDCL: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నెంబర్‌లు.. ఎస్పీడీసీఎల్ కొత్త విధానం!