Seethakka: మేడారం జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి
నార్త్ తెలంగాణ

Seethakka: మేడారం జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి.. మంత్రి సీతక్క!

Seethakka: సమక్క సారలమ్మ జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ (సీతక్క) (Seethakka) అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో జాతరను ప్రెస్ కవరేజ్ చేస్తున్న వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టు లకు, మీడియా ప్రతినిధులకు మంత్రి సీతక్క టీ షర్ట్ లను పంపిణీ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంమైన సమక్క సారలమ్మ జాతర కు భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.

Also Read: Minister Seethakka: చిలకలగుట్ట, ట్రైబల్ మ్యూజియంను సందర్శించిన మంత్రి సీతక్క

40 రోజుల సరిపడా ఏర్పాట్లు చేశాం

ములుగు జిల్లాలో నిర్వహించే జాతర లో ప్రస్తుత సంవత్సరం అనేక మార్పులు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఆదివాసుల అస్థిత్వం, ఆత్మగౌరవం, పూజ విధానం లో మార్పు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. జాతరకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డు విస్తరణ, మెరుగైన పారిశుధ్య చర్యలు, విద్యుత్ దీపాలంకరణ, క్యూ లైన్ సౌకర్యాలు మెరుగయ్యాయని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర తీసుకొచ్చే విధానం పూజ వ్యవహారాలలో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. 4 రోజులు జరిగే సమక్క సారలమ్మ జాతరకు ప్రస్తుత సంవత్సరం 40 రోజుల సరిపడా ఏర్పాట్లు చేశామని అన్నారు.

ప్రపంచానికి మీడియా చాటి చెప్పాలి 

భక్తులకు అవసరమైన టాయిలెట్స్, త్రాగు నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు అదనపు కార్మికులను ముందుగానే జాతర స్థలం వద్ద సిద్ధం చేశామని అన్నారు. సమక్క సారలమ్మ జాతరకు ఇప్పటి వరకు 20 లక్షల భక్తులు వచ్చారని అంచనా వేశామని అన్నారు. సమక్క సారలమ్మ జాతర కవర్ చేసే అదృష్టం పాత్రికేయులకు కలిగిందని, జాతర యొక్క ఔన్నత్యం గొప్పతనాన్ని బయట ప్రపంచానికి మీడియా చాటి చెప్పాలని మంత్రి తెలిపారు. రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సమయానికి మీడియా కు సైతం పెద్ద హాల్, మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి. ఎస్. జగన్, ఉప సంచాలకులు వెంకటేశ్వర్లు, వెంకట సురేష్ సంబంధించిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Seethakka: మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?