Bhadradri Kothagudem: ఆ జిల్లా ఓ విందు అందరినీ ఆశ్చర్యానికి
Bhadradri Kothagudem ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Bhadradri Kothagudem: ఆ జిల్లా ఓ విందు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. కొత్త అల్లుడికి 271 రకాల వంటకాలు!

 Bhadradri Kothagudem:  సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ల సందడి, అత్తగారింటి ఆతిథ్యం. అయితే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచలో జరిగిన ఓ విందు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పండుగ సంప్రదాయాన్ని గౌరవిస్తూ, తమ కొత్త అల్లుడిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఓ కుటుంబం ఏకంగా 271 రకాల వంటకాలతో భారీ విందును ఏర్పాటు చేసింది.

ఒకేచోట 271 రకాల రుచులు

పాల్వంచ పట్టణం హైస్కూల్ రోడ్డులో నివాసముంటున్న గర్రె శ్రీనివాసరావు, పారిజాతం దంపతుల కుమార్తె ప్రణీతకు, దత్త రామకృష్ణతో వివాహం జరిగింది. వివాహానంతరం వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో, అల్లుడికి అరుదైన రీతిలో స్వాగతం పలకాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 271 రకాల పిండివంటలు, స్వీట్లు, హాట్లు, వివిధ రకాల సంప్రదాయ వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. టేబుళ్లపై వరుసగా పేర్చిన వంటకాలను చూసి అల్లుడితో పాటు బంధుమిత్రులు కూడా అబ్బురపోయారు.

Also Read:Bengaluru: బెంగళూరులో విషాదం.. భవనం పై నుంచి దూకి యువ ఉద్యోగి ఆత్మహత్య 

సంప్రదాయానికి సరికొత్త మెరుపు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి నాడు కొత్త అల్లుడిని ఆహ్వానించి పిండివంటలు వడ్డించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే ఈ మధ్య కాలంలో వందల సంఖ్యలో వంటకాలు వడ్డించే సంస్కృతి పెరుగుతుంది. ఈ క్రమంలోనే గర్రె శ్రీనివాసరావు దంపతులు తమ కూతురు, అల్లుడిపై ఉన్న మమకారంతో అత్యంత ఘనంగా ఈ విందును నిర్వహించారు. సంప్రదాయాలను కాపాడుతూ, కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమం సాగింది.

ఆదర్శంగా నిలిచిన కుటుంబం

ఈ భారీ విందును చూసిన స్థానికులు, బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గర్రె దంపతులను అభినందించారు. సాధారణంగా వంద రకాల లోపు వంటకాలతో ఆతిథ్యం ఇవ్వడం చూస్తుంటామని, కానీ ఏకంగా 271 రకాలతో విందు ఇవ్వడం విశేషమని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన విందుకు సంబంధించిన ఫోటోలు జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

Also Read: Sankranti Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. మరికొన్ని స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు మీకోసం..!

Just In

01

Medaram Jatara: మేడారం వన దేవతల దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఒక్క రోజే ఎన్ని లక్షలంటే?

Secunderabad Issue: వచ్చేది మేమే.. సికింద్రాబాద్‌ను జిల్లా చేస్తాం.. కేటీఆర్ కీలక ప్రకటన

Municipal Elections: వార్డుల రిజర్వేషన్లపై కలెక్టర్ల కసరత్తు.. నేడో, రేపో మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్​ జారీ!

Road Accident: దైవ దర్శనం ముగించుకొని వస్తుండగా ప్రమాదం.. చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు అక్కడికక్కడే మృతి!

Jhansi Incident: ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. వీడియో వైరల్!