International Yoga Day: సంగారెడ్డి(Sangareddy) పట్టణంలోని తార డిగ్రీ కళాశాలలో 11 వ, అంతర్జాతీయ యోగా(Inter National Yoga Day) దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు, విద్యార్థులు యోగాను నిత్య జీవితంలో అనుసరించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రావీణ్య(Collector Pravinya) మాట్లాడుతూ యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పర్చు కోవచ్చున్నారు .ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను అలవాటుగా చేసుకోవాలి అని ఆకాంక్షించారు.
యోగ అభ్యాసం ద్వారా విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా, మానసికంగా స్థిరతను పొందేలా చేయవచ్చును. అలాగే, చదువుపై దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది. యోగ అభ్యాసం విద్యార్థుల్లో ఒత్తిడి నివారణకు, ఏకాగ్రత పెంపుదలకు దోహదం చేస్తుంది. నిత్య జీవితంలో యోగా భాగం అయితే, విద్యార్థులు అభ్యాసం, అభివృద్ధిలో ముందంజలో ఉంటారన్నారు. యోగ సాధన ద్వారా విద్యార్థులు మెరుగైన ఆరోగ్యం, చురుకుదనం సాధించగలుగుతారు.
Also Read: Anil Kumar Transferred: ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్‌పై బదిలీ వేటు
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గాయత్రి దేవి, మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యుఓ) లలిత కుమారి, యువజన సేవల శాఖ అధికారి ఖాసీం బెగ్, ఆయుష్ శాఖ అధికారులు, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, ఎన్సిసి విద్యార్థులు, విద్యార్థి, విద్యార్థినులు సిబ్బంది, స్థానిక పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.