Anil Kumar Transferred (imagcredit:ywitter)
తెలంగాణ

Anil Kumar Transferred: ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్‌పై బదిలీ వేటు

Anil Kumar Transferred: నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ జనరల్(ఈఎన్సీ) జి. అనిల్ కుమార్(Anil Kumar) పై బదిలీ వేటు వేసింది. అధికారులు ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రభుత్వానికి తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా(Rahul Bojja) ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఈ బదిలీని పరిపాలన సౌలభ్యం కోసం చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ గ్రౌటింగ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనిల్ కుమార్ పై బదిలీ వేసినట్లు సమాచారం. అంతేగాకుండా ఇటీవల ఏసీబీకి(ACB) పట్టుబడిన అధికారి శ్రీధర్‌తో అనిల్ కుమార్‌కు ఉన్న సంబంధాలు, శాఖలోని కీలక సమాచారం లీక్ అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ వేటు పడినట్లు సమాచారం.

Also Read: Bhatti Vikramarka: అభివృద్ధికి కొత్త నిర్వచనం తెలంగాణ.. డిప్యూటీ సీఎం

నిపుణుల కమిటీ తుది నివేదికలో

గ్రౌటింగ్ చేయడంలో బ్యారేజీకి సంబంధించిన అన్ని పరీక్షలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని ఎన్డీఎస్ఏ(NDSA) నిపుణుల కమిటీ తుది నివేదికలో పేర్కింది. ఎవరి ఆదేశాల మేరకు గ్రౌటింగ్ చేశారని అనిల్ కుమార్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీధర్ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వానికి కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో పాటు నీటిపారుదల శాఖ (Irrigation department) కు సంబంధించిన అత్యంత రహస్యమైన, ముఖ్యమైన సమాచారం బయటకు లీక్ అవుతోందని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) కేంద్రానికి రాసే లేఖలు ముందుగానే బీఆర్ఎస్(BRS) నేతల వద్దకు చేరడం, కీలక సమాచారం వంటివి బయటకు వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం.

అనిల్ కుమార్ స్థానంలో చీఫ్ ఇంజినీర్ (ఎంక్వైరీస్) అమ్జద్ హుస్సేన్‌కు(Ahmad Hussain) ఈఎన్సీగా జనరల్ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఆయన ఈఎన్సీ (అడ్మిన్) గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహమ్మద్‌ అమ్జద్ హుస్సేన్‌కు ఈఎన్సీ (జనరల్) పోస్టుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read: Medchal Govt Lands: గతంలోనే పలుచోట్ల.. భూముల లెక్క తేల్చిన అధికారులు!

 

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు