Bhadradri Kothagudem (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Bhadradri Kothagudem: అధికారుల సూచనలు పక్కదారి పట్టిస్తున్న రైజింగ్ కాంట్రాక్టర్

Bhadradri Kothagudem: కొత్తపల్లి రామాంజనేయులు చెప్పినట్టే వింటామని చర్ల మండలం మొగలపల్లి గ్రామం ఆనంద కాలనీకి చెందిన భూమిపుత్ర ట్రైబల్ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ పరస్పర సహాయ సహకార సంఘం సభ్యుల అధ్యక్షురాలు అన్నారు. కొత్తపల్లి రామాంజనేయులు భూమిపుత్ర ట్రైబల్ ఇసుక క్వారీ వారికి రైసింగ్ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 88 మంది సభ్యుల ఈ భూమిపుత్ర ట్రైబల్ ఇసుక క్వారీకి సంబంధించిన వారిలో 12 మంది సభ్యులను తన గుప్పిట్లో పెట్టుకుని మిగతా సభ్యులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇదే విషయమై గత నాలుగు రోజులుగా భూమిపుత్ర ఇసుక క్వారీ సభ్యులకు సంబంధించి అవకతవకలకు జరుగుతోందంటూ 12 మంది రైసింగ్ కాంట్రాక్టర్ మినహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ కుటుంబాలకు చెందాల్సిన ఆదాయాన్ని 12 మంది సభ్యులు, ఇసుక క్వారీ అధ్యక్షురాలు, రైసింగ్ కాంట్రాక్టర్ కొత్తపల్లి రామాంజనేయులు మాత్రమే లబ్ధి పొందుతూ ఇతర సభ్యులకు ఆదాయం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్ల మండలం ఆదివాసి లకు చెందిన భూమిపుత్ర ఇసుక క్వారీ మొగలపల్లి గ్రామంలో కారు చిచ్చు రేపుతోంది. తరాల తరబడి ఒకే కుటుంబంలో నివసించిన ఆ గ్రామం నేడు రైసింగ్ కాంట్రాక్టర్ చేతిలో కీలుబొమ్మగా మారి గిరిజన కుటుంబాల మధ్య చిచ్చు రేపుతుంది. కోట్లు దండుకుంటూ సంఘం సభ్యుల అధ్యక్షురాలిని, మరో 12 మందిని తమ గుప్పిట్లో ఉంచుకొని ఆ గ్రామ కుటుంబాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.

సభ్యులతో సంబంధం లేదు
భూమిపుత్ర ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు పరస్పర సహాయ సహకార సంఘం సభ్యుల అధ్యక్షురాలు సంఘంలోని సభ్యులతో తనకే సంబంధం లేదని, కేవలం రైసింగ్ కాంట్రాక్టర్ తో మాత్రమే తనకు సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో ఆ వివాదానికి మరింత బలంగా చిచ్చు రాజుకుంటుంది. ఆదివాసీల అమాయకత్వంతో ఆడుకుంటూ సొసైటీలోని పాలకవర్గాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని సొసైటీకి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాన్ని మిగతా సభ్యులకు అందకుండా చెందకుండా రైసింగ్ కాంట్రాక్టర్ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

అధికారులు సైతం నాలుగు రోజుల క్రితం రైజింగ్ కాంట్రాక్టర్ పక్షాన వ్యవహరించి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత సంఘం సభ్యుల బాధ్యుల తరపున వకాల్తాపుచ్చుకున్నప్పటికీ రైజింగ్ కాంట్రాక్టర్లు మార్పు లేకపోవడంతో ఆ సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు దక్కాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతూ తమ కుటుంబాలను రోడ్డుకు ఈడుస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. భూమిపుత్ర ఇసుక క్వారికి సంబంధించిన లావాదేవీలన్నింటిని మిగతా సభ్యులకు తెలవకుండా ఆదాయం మొత్తం తానే నొక్కేస్తున్నాడని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Medchal News: నివాస గృహాల మధ్య స్టీల్ కంపెనీ.. ప్రజలకు నరకం

ఆదివాసిలతో ఆడుకుంటున్న రైజింగ్ కాంట్రాక్టర్
అమాయక ఆదివాసి ఇసుక క్వారీ సభ్యులతో రైసింగ్ కాంట్రాక్టర్ కొత్తపల్లి రామాంజనేయులు, సంఘ అధ్యక్షురాలు వారితో చెలగాటమాడుతున్నారు. క్వారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని తమకు పంచాలంటూ డిమాండ్ చేస్తే వారిని ఏమాత్రం లెక్క చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆదివాసి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తమకు దక్కల్సిన ఆదాయం దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్ ట్రైబ్ కోట్లు ఖర్చుపెట్టి రిచ్ నడిపిస్తున్నారు. ఆదివాసీలకు ఆదాయాన్ని వనకూర్చేందుకు నాన్ ట్రైబ్ కోట్లు పెట్టుబడి పెట్టి రీచ్ నడిపిస్తున్నారని సంఘ అధ్యక్షురాలు చెప్పడంతో సంఘంలోని మిగతా సభ్యులంతా ఖంగు తింటున్నారు. ఏం చేయాలో పాల్గొక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. స్పందించిన అధికారులు సంఘ సభ్యులు మెజార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలని సూచించిన పట్టించుకోవడం లేదు.

ఈ రైసింగ్ కాంట్రాక్టర్ రెచ్చిపోవడానికి గల కారణం ఏంటని అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ అంత చిక్కడం లేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసి మహిళలు తమ గోడును వివిధ మాధ్యమాల ద్వారా వెల్లబోసుకుంటున్నారు. రీచ్‌కి సంబంధించిన లెక్కలు చెప్పడం లేదు కాబట్టి రైసింగ్ కాంట్రాక్టర్ మాకు వద్దు భూమిపుత్ర ఇసుక రీచ్‌కు సంబంధించిన రైసింగ్ కాంట్రాక్టర్ ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు చెప్పడం లేదు కాబట్టి ఈ రైసింగ్ కాంట్రాక్టర్ మాకు వద్దు అంటూ సంఘ సభ్యులు మూకుమ్మడిగా వెల్లడిస్తున్నారు. తమకు రావాల్సిన ఆదాయాన్ని కేవలం 12 మంది సభ్యులు, అధ్యక్షురాలు, రైసింగ్ కాంట్రాక్టర్ మాత్రమే పంచుకుంటూ తమకు రావాల్సిన డబ్బులను కాసుకున్నారని వివరిస్తున్నారు.

ఇసుక పాలసీ ప్రకారం నడుపుకుంటాం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఇసుక పాలసీ ప్రకారం మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకే రిచ్‌ను నడుపుకోవలసి ఉంటుందని, ఈ మేరకు తక్కువ శాతం ఉన్న సభ్యుల నుంచి, రైసింగ్ కాంట్రాక్టర్ నుంచి తమకు రీచ్ బాధ్యతలను అప్పగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటే వారికి చేయాల్సిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. మా రీచ్‌కు సంబంధించిన బుక్స్, ఇతర వాటన్నింటిని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల సూచనలు సైతం పక్కదారి పక్కదారి పట్టిస్తూ అధ్యక్షురాలు, రైసింగ్ కాంట్రాక్టర్ రామాంజనేయులు తమకు ఆదాయం లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని భూమిపుత్ర ఇసుక రీచ్ లేబర్ నిర్వాహక సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also READ: Malla Reddy Son: మల్లారెడ్డి కుమారుడి ఇంటిలో ఐటీ అధికారులు.. నిజమేనా?

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?