Case on Myntra: ఈడీ (ED) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ కంపెనీ అయిన Myntra Designs Pvt Ltd పై విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం రూ. 1,654.35 కోట్లు విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల దుర్వినియోగం జరిగిందని ఈడీ ఆరోపణలు చేసింది.
నిబంధనలకు విరుద్ధం
మైంత్రా సంస్థ తమ కంపెనీ కార్యకలాపాలు మోత్తం హోల్ సేల్ క్యాష్ మరియు క్యారీ వ్యాపారంగా చూపించి విదేశీ పెట్టుబడులు ఆకర్షించింది. కానీ ఈ సంస్థ యోక్క తదితర సంబంధిత సంస్థ అయిన వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపారం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ తన కేసులో పేర్కోంది. ఈ నిభందన అనేది 2010లో ఉన్న FDI పాలసీని ఉల్లంఘించిందని ఈడి పేర్కోంది. వాస్తవానికి హోల్సేల్ కంపెనీలు తమ ఉత్పత్తులను 25% కంటే ఎక్కువగా సంబంధిత వివిధ సంస్థలకు అమ్మకూడదు. కాగాMyntra సంస్ధ తమ మొత్తం అమ్మకాలన్నింటిని Vector అనే సంబంధిత కంపెనీకి ఇచ్చేసింది.
Also Read: Medak district: అనిల్ హత్యకేసులో మరో నిందితుడు షాబొద్దీన్ అరెస్ట్
ఉల్లంఘనలు రుజువైతే దండనలు
దీంతో ఈ అమ్మకాలు చివరికి వినియోగదారుల వద్దకు చేరుతున్నాయి. ఇది పూర్తిగా B2C (Business to Consumer) మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారం అవుతుంది. అయితే ఇది నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం అని ఈడీ తమ కేసులో పేర్కోంది. FEMA సెక్షన్ 6(3)(b) ప్రకారం FDI నియంత్రణలను, సెక్షన్ 16(3) కింద చర్యలను ఈడీ తెలిపింది. ఈ సంస్థల డైరెక్టర్లు మరియు బాధ్యత వహించే వ్యక్తులు కూడా ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తులు ఉన్నట్లు ఈడీ పేర్కోంది. ఈ కేసులో వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు మరియు కంపెనీకి బాధ్యత వహించే కొంతమంది అధికారులు ఈ కేసులో ఉన్నారని ఈడీ పేర్కోంది. కంపెనీ ఉల్లంఘనలు రుజువైతే దండనలు లేదా జరిమానాలు విధించనుంది. అయితే ప్రస్థుతం Myntra సంస్థ ఈడీ నుంచి మాకు ఎలాంటి అధికారిక సమాచారం గానీ నోటీసు రాలేదని సంస్థ తెలిపింది.
Also Read: Telangana Tourism: తెలంగాణ టూరిజంలో సంచలనం.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!