Medak district (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Medak district: అనిల్ హత్యకేసులో మరో నిందితుడు షాబొద్దీన్ అరెస్ట్

Medak district: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెదక్(Medak) జిల్లా కాంగ్రెస్(Congress) నేత మారెల్లి అనిల్ 30 హత్యకేసులో గన్‌తో అనిల్‌ను కాల్చి చంపిన A4 నిందితుడు షాబొద్దీన్‌(Shahbuddin)ను మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో డిఎస్పీ ప్రసన్న కుమార్(DSP Prasanna Kumar), సి ఐ రాజశేఖర్ రెడ్డి(CI Rajasekhar Reddy) ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. అనంతరం షబొద్దీన్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మీడియాతో డిఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ అనిల్‌ను ఈ నెల 14 వ తేదీన విజయవాడకు చెందిన షాబొద్దీన్ గన్ తో అనిల్ పై 4 రౌండ్లు కాల్పులు జరిపిన చంపినట్లు తెలిపారు.

అనిల్ హత్య కేసులో 7 గురు
విజయవాడకు చెందిన షాబొద్దీన్ గ్యారేజ్‌లో పని చేస్తున్నారని అనిల్(Anil) హత్యకేసులో 7 గురు నిందితుల్లో షాబొద్దీన్ ఒకరని చెప్పారు. మంగళవారం షబొద్దీన్ ను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. అనిల్ హత్య కేసులో 7 గురు నిందితులకు గాను 5 గురుని సోమవారం ఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేయగా నేడు షాబొద్దీన్‌(Shahbuddin)ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 6 గురు నిందితులను అరెస్ట్ చేయగా మరో నిదితుడు చిన్నా (విజయవాడ) పోలీసులకు దొరకాల్సి ఉంది.

Also Read: Bandi vs Etela: హైకమాండ్ వద్ద బండి ఈటల ఇష్యూ.. చెక్ పడునుందా!

చున్నాను అరెస్ట్ చేసేందుకు పోలీస్ టీమ్ గాలిస్తుందని త్వరలో అరెస్ట్ చేస్తామని మెదక్(Medal) డిఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డితో పాటు ఎస్ ఐ లు పాల్గొన్నారు. నిదితుడు షాబొద్దీన్ నుంచి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్