Bandi vs Etela: టీ బీజేపీ నేతల పంచాయితీ హస్తినకు చేరింది. ఇన్నిరోజులు స్తబ్దుగా ఉన్న కాషాయ పార్టీలో ఆధిపత్య పోరు ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay,), మల్కాజిగిరి ఎంపీ ఈటల(MP Etala Rajender) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. అయితే ఈ పంచాయితీ కాస్త ఇప్పుడు ఢిల్లీ పెద్దల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో ఆధిపత్య పోరు, వరుస పంచాయితీలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) వివాదం ముగిసిన వెంటనే తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య లొల్లి బీజేపీ కేడర్‌లో తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల టైమ్ లో ఇద్దరు పెద్ద బీసీ లీడర్ల మధ్య గొడవ పార్టీలో గందరగోళం సృష్టిస్తోంది.
కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం
బండి, ఈటల మధ్య ముదిరిన పొలిటికల్(Political) యుద్ధంపై ఎవరూ స్పందించవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో రాష్ట్ర నేతలేవరూ ఈ అంశంపై నోరుమెదపడం లేదు. వాస్తవానికి కొద్ది రోజులుగా ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాషాయ(BJP) పార్టీలో చేరిన నాటి నుంచి బండి, ఈటల మధ్య పొసగడంలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఒకటే జిల్లా పక్క పక్క సెగ్మెంట్లు కావడం, అలాగే ఇద్దరూ బీసీ నేతలే కావడంతో ఒకరినొకరు ఎవరికి వారుగా కాంపిటీషన్ గా భావించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అప్పటి నుంచి ఉప్పు.. నిప్పు.. అన్నట్లుగా సీన్ మారింది. పైకి ఆధిపత్య పోరు లేదని, కలిసి ఉన్నట్లుగా ఉన్నామని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోపల మాత్రం ఒకరికొకరు చెక్ పెట్టుకోవడంపై దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: HHVM Team Interview: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఏంటో తెలుసా!
ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి బండి సంజయ్‌ని అధిష్టానం తప్పించింది. దీనికి వెనుక ఈటల రాజేందర్(Etala Rajender) హస్తముందని బండి వర్గీయులు విమర్శలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్న ఈటలకు ఆ పదవి రాకపోవడం వెనుక బండి సంజయ్ హస్తముందని, ఆయన చక్రం తిప్పారని ఈటల అనుచరులు గుర్రుగా ఉన్నారు. మొదటి నుంచి వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ ఉన్నా ఎప్పుడూ బయటపడలేదు. తాజాగా ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికల(Local body elections) సమయంలో ఇద్దరు నేతల మధ్య పంచాయతీ కేడర్‌లో కొంత గందరగోళానికి దారి తీస్తోంది. ఈ టైమ్ లో బీజేపీ(BJP)లో అంతర్గత కలహాలు పార్టీ బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం కొనసాగితే రూరల్ ఏరియాలో బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడొచ్చని చెబుతున్నారు.
బండి ఇష్యూ తమ దృష్టికి రాలేదు
ఇదిలా ఉండగా ఈ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారంపై ఈటల వర్గీయులు హైకమాండ్ కు ఫిర్యాదు చేశామని, వారే చూసుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై రాష్ట్రనాయకత్వం ఆంక్షలకు పరిమితమైంది తప్పా ఎక్కడా స్పందించలేదు. ఈ తరుణంలో తెలంగాణ(Telangana) కాషాయ దళపతి రాంచందర్ రావు(Ramachandra Rao) హుటాహుటిన ఢిల్లీ(Delhi) పర్యటనకు వెళ్లడం ఉత్కంఠను రేపుతోంది. పార్టీ పెద్దలను ఆయన కలిసి ఈ అంశంపై చర్చించే ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాజాసింగ్ రాజీనామాను ఆమోదించి షాకిచ్చిన జాతీయ నాయకత్వం బండి, ఈటల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో మీడియా అడగ్గా ఈటల, బండి ఇష్యూ తమ దృష్టికి రాలేదని రాంచందర్ రావు చెప్పుకొచ్చారు.
కానీ ఆయన మంగళవారం సైతం ఢిల్లీలోనే ఉండనుండటంతో హైకమాండ్ ఏం చెబుతుందనేది చర్చనీయాంశంగా మారింది. స్టేట్ చీఫ్ పదవి దక్కకపోవడంతో నిరాశలో ఉన్న ఈటలను పార్టీ నచ్చజెప్పుతుందా? లేదా? అనేది చూడాలి. స్టేట్ చీఫ్ పదవి ఎలాగూ ఇవ్వకపోవడంతో త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా క్యాంపెయిన్ కమిటీలో అయినా చోటు కల్పిస్తారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రాంచందర్ రావు ఢిల్లీ పర్యటనతో ఈ అంశంపై స్పష్టతనిస్తారా? జాతీయ నాయకత్వం త్వరగా స్పందించి ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెడుతుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: Viral News: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ విండో తెరవబోయిన ప్యాసింజర్