HHVM Team Interview
ఎంటర్‌టైన్మెంట్

HHVM Team Interview: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఏంటో తెలుసా!

HHVM Team Interview: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. జూలై 24న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయనే విషయం తెలియంది కాదు. ప్రస్తుతం మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా కొనసాగిస్తున్నారు. శనివారం చిత్ర మేకింగ్ వీడియో వదిలి సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిన మేకర్స్.. మరికొద్దిసేపటికే యాంకర్ సుమతో టీమ్ ఇంటర్వ్యూని వదిలారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి అనేక విషయాలను వారు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో నిర్మాత ఎఎమ్ రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు.

ఈ సినిమా నిర్మాణానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇది పీరియడ్ ఫిల్మ్. నెంబరాఫ్ సెట్స్, పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలు, పాలిటిక్స్ వంటి వాటితో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. కాకపోతే లేటుగా వచ్చిన లేటెస్ట్‌గా సినిమా ఉంటుంది. ట్రైలర్ చూశారు కదా. సినిమా కచ్చితంగా అందరినీ అలరించి బ్లాక్‌బస్టర్ అవుతుంది అని నిర్మాత ఎఎమ్ రత్నం చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇతర దేశాల్లో షూట్ చేయలేదు. ఓన్లీ గ్రాఫిక్స్, ఇతరత్రా సాంకేతిక పనులు వరకు మాత్రమే ఇతర దేశాలలో జరిగాయి. హాలీవుడ్ సినిమాలు చేసిన కంపెనీలు ఈ సినిమాకు పనిచేశాయి. ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. వాటన్నింటిని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇప్పటి వరకు అందరూ ఆయనని పవర్ స్టార్ పవర్ స్టార్ అంటున్నారు కానీ, ఆయన రియల్ స్టార్. సినిమాలలోనే కాదు.. పబ్లిక్‌లో కూడా ఆయన రియల్ స్టార్. ప్రజల కోసమే ఆయన జీవిస్తున్నారని రత్నం చెప్పుకొచ్చారు.

Also Read- HHVM: ‘హరి హర వీరమల్లు’ మూవీకి భారీగా టికెట్ రేట్లు పెంపు

ఇందులోని పంచమి పాత్ర కోసం గుర్రపు స్వారీ, కొంత భరతనాట్యం, కథక్ కూడా నేర్చుకున్నాను. ఈ పంచమి పాత్రకు సంబంధించి కథను నాకు దర్శకుడు క్రిష్ చెప్పారు. నేను కూడా ఈ సినిమా కోసం 5 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. అప్పటి నిధికి, ఇప్పుటి నిధికి చాలా మారిపోయాను. నేను వ్యక్తిగతంగా చాలా వరకు ఎదిగానని అనుకుంటున్నానని నిధి చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో మేకప్, దుస్తులు ఛేంజ్ కోసం ప్రతిరోజూ రెండు నుంచి రెండున్నర గంటలు పట్టేది. ఇందులో నేను రాణిగా కనిపిస్తాను. కొల్లగొట్టినాదిరో సాంగ్‌తో నేను షూటింగ్‌లోకి ఎంటరయ్యాను. ఆ డే నాకు చాలా స్పెషల్. ఒక టీ గ్లాస్ పట్టుకుని కూర్చుని కళ్యాణ్ సార్ ఉన్నారు. ఫస్ట్ షాట్ చేసే సమయంలో ఎగ్జయిట్ అయ్యానని నిధి తెలిపింది.

పీరియడ్ చిత్రాలు తీయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. లైటింగ్ వనరులతో పాటు, టీమ్ అంతా ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి. చాలా సవాల్‌తో కూడుకున్న ప్రాజెక్ట్ ఇది. జ్ఞాన్ శేఖర్ చాలా వరకు ప్రీ విజువలైజేషన్ చేశారు. క్రిష్ ఉన్నప్పుడే చాలా వరకు ఆయన పూర్తి చేశారు. ఆయన తర్వాత నేను పూర్తి బాధ్యతలు తీసుకున్నాను. పవర్ స్టార్ బిజీ షెడ్యూల్‌తో బిజీగా ఉండటంతో మాకు చాలా సమయం లభించింది. సినిమాను చాలా గ్రాండియర్‌గా రూపొందించాం. జ్యోతి కృష్ణ ప్రతి దానిలో ఇన్‌వాల్వ్ అయ్యారు. ఆయన విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. ఈ సినిమా తర్వాత ఓజీ కూడా పవన్ కళ్యాణ్ సార్‌తో చేశాను. ఆయన టైమ్ వేస్ట్ చేయకూడదని చాలా ప్లాన్డ్‌గా షూట్ చేశాం. ఆయన ఇచ్చిన టైమ్‌లో షూట్ పూర్తి చేయాలని, ఇంకో షాట్ అని అడిగే అవసరం లేకుండా చిత్రీకరణ చేశామని మనోజ్ పరమహంస తెలిపారు.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా.. ఇక టికెట్స్ తెగడమే!

ఈ చిత్రం మొఘల్ యుగంలో, ప్రత్యేకంగా 1684లో, ఛత్రపతి శివాజీ మరణానంతరం, ఔరంగజేబు చక్రవర్తి అవుతున్న సమయంలో జరుగుతుందని దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు. ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాల టైమ్‌లోనే నాకు పవన్ గారితో పరిచయం ఉండేది. ఆయనే నన్ను డైరెక్షన్ బాధ్యతలు తీసుకోమని చెప్పారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో ఎఫర్ట్ పెట్టారు. ఆయన విజన్ ఏమిటంటే.. ఈ సినిమా ఇండియా మొత్తం విస్తరించాలి. ఆయన డ్రీమ్‌తో పాటు, నాన్నగారి డ్రీమ్ కారణంగానే ఈ సినిమా సాధ్యమైంది. కళ్యాణ్ సార్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ఉపయోగించి, ప్రత్యేకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరించాం. మొత్తం 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక ఎపిసోడ్ ఆయనే కంపోజ్ చేశారు. దానిని చిత్రీకరించడానికి 50-60 రోజులు పట్టింది. ఎటువంటి డూప్స్ లేకుండా షూట్ చేశాం. మిగతా ఫైట్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇందులో అండర్‌ కరెంట్‌‌గా ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. అది సినిమాలో చూడాల్సిందేనని జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.

సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాల కోసం కింది వీడియో చూసేయండి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు